పెద‌వి ముద్దులు ఛాన్స్ కుమార్తెకే వ‌దిలేసిన న‌టి!

బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ నో లిప్ కిస్ పాల‌సీని అనుస‌రించిన న‌టి. హీరోయిన్ గా బిజీగా ఉన్న స‌మ‌యంలో పెద‌వి ముద్దు స‌న్నివేశాల‌కు ఆమె దూరంగా ఉండేవారు

Update: 2023-09-30 00:30 GMT

బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ నో లిప్ కిస్ పాల‌సీని అనుస‌రించిన న‌టి. హీరోయిన్ గా బిజీగా ఉన్న స‌మ‌యంలో పెద‌వి ముద్దు స‌న్నివేశాల‌కు ఆమె దూరంగా ఉండేవారు. బాలీవుడ్ తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ ఆమె సినిమాలు చేసారు. కానీ ఏనాడు లిప్ కిస్సులు జోలికి వెళ్లింది లేదు. ఇంటిమేట్ స‌న్నివేశాల్లో న‌టించారు గానీ...లిప్ కిస్సులకు మాత్రం తొలి నుంచి దూరంగా ఉన్నారు.

ఆమెని లిప్ కిస్సుని ఎంత‌గా ద్వేషిస్తుందా? ఈ మ‌ధ్య‌నే త‌న‌కెదురైన అనుభ‌వం గురించి చెప్పింది. పొర‌పాటున న‌టుడి పెదాలు తాకినందుకు వాంతులు చేసుకుంది. నోటిని 100సార్లు క‌డ‌గాలి అనిపించింద‌ని త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది. అయితే ఇప్పుడు త‌ల్లి బాట‌లోనే కుమార్తె రాషా థ‌డానీ కూడా ప్ర‌యాణిస్తుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం రాషా అజ‌య్ దేవ‌గ‌ణ్ మేన‌ల్లుడు ఆమ‌న్ దేవ‌గ‌ణ్ న‌టిస్తోన్న చిత‌రంతో ఎంట్రీ ఇస్తోంది.

ఇందులో రాషా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇదొక డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ అని స‌మాచారం. ఇందులో పెద‌వి ముద్దు స‌న్నివేశాలు ఉన్నాయా? లేవా? అన్న‌ది క్లారిటీ లేదు గానీ..ఉంటే రాషా త‌డానీ న‌టిస్తుందా? లేదా? అన్న‌ది మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. మామ్ వేలో 'నో లిప్ కిస్' పాల‌సీని అనుస‌రిస్తుందా? లేక పోటీలో నెట్టుకురావాలంటే అలాంటి వాటికి ఎస్ చెబుతుందా? అన్న‌ది చూడాలి. అయితే ఈ విష‌యంలో మామ్ ర‌వీనా టాండ‌న్ మాత్రం కుమార్తెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు తెలిపింది.

'ఆమెకి అభ్యంత‌రం లేక‌పోతే న‌టించ‌వ‌చ్చు. కానీ ఇమెకి ఇష్టం లేక‌పోతే బ‌ల‌వంతం చేసే అధికారం మాత్రం ఎవ‌రికీ లేదు. అంద‌రూ నాలాగే ఉండాల‌ని లేదు క‌దా. ఎవ‌రి అభిప్రాయాలు వారికుంటాయి. అందుక‌ని మ‌న అభిప్రాయ‌ల్ని..ఇష్టాల్ని వాళ్ల‌పై రుద్దండం క‌రెక్ట్ కాదు. అంఉద‌కే న‌ట‌న విష‌యంలో వారు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా స్వాగ‌తిస్తాను' అని తెలిపింది. దీంతో కుమార్తెల‌కు ఇంటి నుంచి కొన్ని ర‌కాల వెసులు బాట్లు అయితే మామ్ క‌ల్పించిన‌ట్లే క‌నిపిస్తుంది. ర‌వీనా టాండ‌న్ కి ఇద్ద‌రు ఆడ‌బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌గా..మ‌రో ఇద్ద‌ర్ని ద‌త్త‌త తీసుకున్నారు.

Tags:    

Similar News