బిగ్‌ వార్‌.. రజినీతో బచ్చన్‌ ఫ్యాన్‌ ఢీ

అక్టోబర్‌ లో ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ముందే విడుదల అవ్వబోతుంది.

Update: 2024-06-26 23:30 GMT

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిస్టర్ బచ్చన్‌' సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌ లో జరుగుతున్న విషయం తెల్సిందే. జులై లేదా ఆగస్టు వరకు సినిమా షూటింగ్‌ పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదల తేదీ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అక్టోబర్‌ లో ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ముందే విడుదల అవ్వబోతుంది. అక్టోబర్ 10వ తేదీని ఎన్టీఆర్‌ వదిలి పెట్టడంతో ఆ తేదీని మాస్ మహారాజా రవితేజ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే అక్టోబర్‌ లో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్‌ సినిమాను విడుదల చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ ను కూడా అదే రోజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో రవితేజ మిస్టర్ బచ్చన్ ను కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద బిగ్‌ వార్‌ తప్పేలా లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్‌ మిస్టర్ బచ్చన్‌ ను నిర్మిస్తున్నాడు.

రవితేజ సినిమాలు ఎలా ఉన్నా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం కామన్‌ గా చూస్తూ ఉంటాం. హిట్ అయితే సినిమాకు భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం. రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్ కనుక పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకుంటే రజినీకాంత్‌ వేట్టయాన్‌ కి తెలుగు రాష్ట్రాల్లో కాస్త కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Tags:    

Similar News