రవితేజ పాత సినిమా.. హడావుడి బాగానే ఉంది..

కానీ ఎవరు ఊహించని విధంగా వెంకీ అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు సమాచారం.

Update: 2023-12-26 15:09 GMT

మాస్ మహారాజా రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ 'వెంకీ' డిసెంబర్ 30 న రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈమధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఆడియన్స్ కి బోర్ కొట్టేసిన సమయంలో చాలా సినిమాలు రీరిలీజులు క్యాన్సిల్ చేసుకోవడం, పోస్ట్ పోన్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే దారిలో 'వెంకీ' కూడా వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా వెంకీ అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు సమాచారం.

ఇందుకు కారణం వెంకీ సినిమాపై ఉన్న క్రేజ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇటీవల చాలా రీరిలీజులు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. పూర్ బుకింగ్స్ తో భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. కానీ వెంకీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్స్ లో ప్రభాస్ 'సలార్' హవా కొనసాగుతోంది. ఈనెల 29న కళ్యాణ్ రామ్ 'డెవిల్' తో పాటు రోషన్ కనకాల 'బబుల్ గమ్' సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

మరోవైపు సంక్రాంతి సినిమాల కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాల్లో రవితేజ 'ఈగల్' కూడా ఉంది. ఎన్ని ఉన్నా కూడా 'వెంకీ' పై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే 6 వేలకు పైగా టికెట్స్ బుక్ బుక్కయ్యాయని, చాలాచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గర అన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయినట్లు సమాచారం. దీన్ని బట్టి ఈసారి వెంకీ రీ రిలీజ్ ట్రెండ్ లో భారీ కలెక్షన్స్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లాస్ట్ న్యూ ఇయర్ సరిగ్గా ఇదే సమయానికి పవన్ కళ్యాణ్ 'ఖుషి' రీ రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈసారి వెంకీ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో అనేక సినిమాలు దిగుతున్నాయి. ఆ సినిమాలే ఎక్కువ స్క్రీన్స్ ని ఆక్యుపై చేశాయి. కానీ ఉన్నంతలో అయినా వెంకీకి మంచి బుకింగ్స్ దక్కడం విశేషం. రవితేజ నటించిన 'మిరపకాయ్' సినిమా ఇటీవల రీ రిలీజ్ అయి ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.

కానీ వెంకీ మాత్రం ఈసారి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫాన్స్ అంటున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్నేహ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం, అశుతోష్ రానా, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శీను, గిరి, బుజ్జి, ఏవీఎస్ ఇతర పాత్రలు పోషించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Tags:    

Similar News