4 నెలలు రెండు సినిమాలు.. మాస్ జాతర..!
మిస్టర్ బచ్చన్ షో రీల్ తోనే సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా వస్తుందని తెలిసిందే. హరీష్ శంకర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన రవితేజ మిరపకాయ్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్న సినిమా ఇది. అందుకే మిస్టర్ బచ్చన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా షో రీల్ అంటూ సరికొత్త ప్రమోషనల్ కాన్సెప్ట్ ప్లాన్ చేశారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ షో రీల్ తోనే సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఆ డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ రిలీజ్ అనౌన్స్ చేశారు. ఐతే పవన్ ఓజీ దాదాపు వాయిదా కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఐతే అదే డేట్ న ఎన్.టి.ఆర్ దేవర ని దించుతున్నారు మేకర్స్. దేవర సినిమాను ప్రీ పోన్ చేస్తూ అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు.
ఐతే దేవర వస్తున్నా సరే సెప్టెంబర్ 27న రవితేజ మిస్టర్ బచ్చన్ రావడం కన్ఫర్మ్ అంటున్నారు. ఇదిలా ఉంటే రవితేజ 75వ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. భాను భోగవరపు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ధమాకా తర్వాత శ్రీ లీల నటిస్తుండగా ఈ కాంబో సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది.
ఐతే రవితేజ 75వ సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. సినిమాను సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారట. 2025 సంక్రాంతికి రవితేజ సినిమా పక్కా కన్ఫర్మ్ అంటున్నారు. సో సెప్టెంబర్ లో మిస్టర్ బచ్చన్ వస్తే మరో నాలుగు నెలల్లోనే రవితేజ 75 రిలీజ్ కాబోతుంది. నాలుగు నెలల్లోనే మాస్ రాజా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అందించేందుకు సిద్ధమయ్యాడు రవితేజ. మరి ఈ సినిమాలతో రవితేజ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. రవితేజ మాత్రం ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ స్కెచ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.