ముంబై మహాలక్ష్మి ఆలయంలో కుమార్తెతో చెర్రోపాసన
ఈ జంట ఆలయాన్ని సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కామినేని దంపతులకు 2023 ఎగ్జయిటింగ్ ఇయర్. ఈ సంవత్సరం జూన్ 20 న తమ తొలి సంతానం, కుమార్తె క్లిన్ కారా కొణిదెలకు స్వాగతం పలికారు. క్లిన్ కారా బుధవారంతో ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దంపతులు ముంబైలోని మహాలక్ష్మి ఆలయంలో ఆశీస్సులు కోరారు. ఈ జంట ఆలయాన్ని సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లిప్‌లో వారంతా క్లిన్ కారాతో కలిసి ఆలయం నుండి బయలుదేరుతూ కనిపించారు.
ఆ సమయంలో కుమార్తె క్లిన్ను ఉపాసన చేతుల్లో జాగ్రత్తగా ఊయల పెట్టుకుని, కెమెరా ఫ్లాష్ ల నుండి శిశువు ముఖాన్ని రక్షించింది. అభిమానులు, ఫోటోగ్రాఫర్లు ఉత్సాహం చూపించినా కానీ, తమ కుమార్తెపై అనవసర హడావుడి ప్రభావం లేకుండా చూసుకున్నారు. రామ్ చరణ్ తన కారు వద్దకు వెళ్లే ముందు అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు.
చెర్రోపాసన స్నేహం ప్రేమకథ గురించి తెలుగు ప్రజలకు కొంతవరకూ తెలుసు. వారి కళాశాల రోజుల్లో పరస్పర స్నేహితుల ద్వారా మొదటిసారి కలుసుకున్న తర్వాత మంచి స్నేహితులయ్యారు. వారి స్నేహం రొమాంటిక్ బాండింగ్ కి దారి తీసింది. రెండు కుటుంబాల నుండి ఆమోదం పొందిన తరువాత, ఈ జంట 11 డిసెంబర్ 2011 న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. సమయాన్ని వృథా చేయకుండా 14 జూన్ 2012న జరిగిన సాంప్రదాయ వేడుకలో వివాహ ప్రమాణాలు చేసారు.
2023 ఈ జంటకు తీపిగుర్తుల్ని అందించింది. చరణ్ ఓవైపు ఆస్కార్ విజేత ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్ డమ్ అతడి చేతికి చిక్కింది. కుమార్తె క్లిన్ జననంతో వారి ఆనందానికి అవధుల్లేవ్. RRR భారీ విజయం తర్వాత రామ్ చరణ్ తదుపరి గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. S శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.