న‌టిని నిండా ముంచేసిన స్నేహితుడు!

స్నేహం పేరుతో అతిగా న‌మ్మింది. అడ్డంగా బుక్కైంది. జిమ్ లో స్నేహితుడ‌య్యాడు. ఇంటికొచ్చి అమ్మ‌తో క‌లిసి కూర్చుని మాట‌లు క‌లిపాడు

Update: 2024-06-20 06:29 GMT

స్నేహం పేరుతో అతిగా న‌మ్మింది. అడ్డంగా బుక్కైంది. జిమ్ లో స్నేహితుడ‌య్యాడు. ఇంటికొచ్చి అమ్మ‌తో క‌లిసి కూర్చుని మాట‌లు క‌లిపాడు. మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యంలో లంచ్ చేసాడు. క‌ట్ చేస్తే ఆ స్నేహం పీక్స్ కి చేరింది. ఎంత‌వ‌ర‌కూ అంటే ఏకంగా నాలుగు కోట్లు అప్పు ఇంచ్చేంత‌వ‌ర‌కూ. మొద‌ట్లో ల‌క్ష‌లిచ్చింది. వ‌డ్డీ స‌వ్యంగా క‌ట్ట‌డంతో ఇంకా అద‌నంగా మ‌రికొంత అప్పుగా ఇచ్చింది. దీంతో టైమ్ చూసి ఆ స్నేహితుడు నిజ స్వ‌రూపం బ‌య‌ట ప‌డ‌టంతో సీన్ రివ‌ర్స్ అయింది.

వివ‌రాల్లోకి వేళ్తే బెంగాలీ న‌టి రిమీ సేన్ సుప‌రిచిత‌మే. తెలుగులో అమ్మ‌డు మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `అంద‌రివాడు` సినిమాలో జోడీగా న‌టించింది. పొగ‌ర‌బోతు భార్య పాత్ర‌లో రిమా సేను బాగానే క‌నెక్ట్ అయింది. అంత‌కు ముందు కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రాక‌పోవడంతో బాలీవుడ్ కి వెళ్లింది. అక్క‌డ కొన్నాళ్ల పాటు బాగానే సినిమాలు చేసింది.

కానీ ప‌దేళ్ల‌గా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ప‌రిశ్ర‌మ‌కి దూర‌మైంది. పెద్ద తెర‌తో పాటు బుల్లి తెర‌కూ కూడా అదే ఏడాది గుడ్ బై చెప్పేసింది. దీంతో రిమీసేన్ అప్ప‌టి నుంచి అభిమానుల‌కు ట‌చ్ లో లేదు. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేదు. అయితే స్నేహితుడు అప్పు పేరుతో నాలుగు కోట్లు తీసుకుని మోసం చేయ‌డంతో ఆమె పేరు మ‌ళ్లీ నెట్టింట వైర‌ల్ గా మారింది. నాలుగేళ్ల క్రితం జిమ్ములో రోన‌క్ అనే వ్య‌క్తి ప‌రిచ‌మ‌య్యాడు.

అది స్నేహంగా మారింది. చివ‌రికి ఇంటికి తీసుకెళ్లేంత‌గా ఆ స్నేహం బ‌ల‌ప‌డింది. మొద‌ట 20 ల‌క్ష‌లు తీసుకున్నాడు. దానికి తొమ్మిది శాతం వడ్డీ ఇచ్చాడు. ఇంకా ఎక్కువ డ‌బ్బు ఇస్తే 12 శాతం వడ్డీ ఇస్తాన‌న్నాడు. ఆ మాట‌లు న‌మ్మి 4 కోట్లు ఇచ్చింది. మొద‌టి నెల‌లో ఐదారు ల‌క్ష‌లు చేతికిచ్చాడు. ఆ త‌ర్వాత నాన్న‌కి క‌రోనా వ‌చ్చింద‌న్నాడు. చేతిలో డ‌బ్బు లేద‌న్నాడు. అలా కొన్నాళ్ల పాటు త‌ప్పించు కున్నాడు. త‌ర్వాత అమ్మ‌డికి విష‌యం అర్ద‌మైంది. ఇదంతా స్కామ్ అని గ్ర‌హించింది.

అటుపై అత‌డు గురించి అహ్మదాబాద్ లో విచారించింది. అక్క‌డా ఇలాంటి అప్పులు చేసిన‌ట్లు తెలుసుకుంది. ఏడాదిన్న క్రితం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన కేసు ఇప్పుడు సీఐడీ చేతికి చేరింది. వడ్డీతో క‌లిసి 14 కోట్లు ఇవ్వాల‌ట‌. ఆ మొత్తం రాక‌పోతే ఎంత‌దూర‌మైనా వెళ్తాన‌ని రిమీసేన్ వెల్ల‌డించింది. హైకోర్టులో పిటీషన్ వేసిన నేప‌థ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది.

Tags:    

Similar News