తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇంకో జన్మ ఎత్తినా మారరు
అదంతా అటుంచితే, ఇటీవల తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ మరో తెలుగు నటి రేఖ భోజ్ క్యాంపెయిన్ చేస్తున్నారు.
తెలుగు హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావడం లేదనే అపవాదు ఉండనే ఉంది. కానీ ఇది వందశాతం నిజం కాదు. ప్రతిభ చురుకుదనం ఉన్న చాలామంది తెలుగమ్మాయిలు ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు. అందుకు శ్రీలీల, డింపుల్ హయాథీ లాంటి పెద్ద హీరోయిన్లు ఉదాహరణలు.
అదంతా అటుంచితే, ఇటీవల తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ మరో తెలుగు నటి రేఖ భోజ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలుగు దర్శకనిర్మాతలను ఈ విషయంలో రేఖ నిలదీస్తున్నారు కూడా. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిసారీ మాలీవుడ్ హీరోయిన్లకే అవకాశాలిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేసింది. మీనన్‌లనే కాదు తమను కూడా చూడాలని తనదైన శైలిలో సెటైర్ వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేఖ భోజ్. దీనిపై రోజంతా చర్చ జరిగింది.
ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు అనుకుంటుండగానే టాలీవుడ్ దర్శకనిర్మాత అభిషేక్ నామాపైనా తనదైన శైలిలో కామెంట్ చేసింది రేఖ. పెద కాపు ఫేం విరాట్- నభా నటేష్- ఐశ్వర్య మీనన్ నటీనటులుగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్' ఇటీవలే ప్రారంభం కాగా, దీనికి సంబంధించిన పోస్టర్ ని షేర్ చేస్తూ అందులో ఉన్న ఇద్దరు హీరోయిన్లను రెడ్ పెన్ తో రౌండప్ చేసింది.
వీళ్ళిద్దరి(హీరోయిన్లు) వల్ల ఒక పది టికెట్స్ కూడా ఎక్సట్రా తెగవు. అయినా సరే ఇలాంటి చిన్న ప్రాజెక్ట్ కి కూడా తెలుగు అమ్మాయిలను కాదని విమాన టికెట్లు, హోటల్ బిల్స్, భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి మరీ వీళ్ళను తెచ్చుకుంటారు ఖర్మ.. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇంకో జన్మ ఎత్తినా మారరు. వీళ్ళింతే ఇక.. అంటూ చీదరించుకుంది. చివరికి లాస్ట్ లైన్ హీరోస్ ఆయిన సుహాస్, కిరణ్ అబ్బవరం, రాజ్ తరుణ్, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళ పక్కన కూడా తెలుగు అమ్మాయిలు లేరు! అంటూ రేఖ భోజ్ కామెంట్ చేసింది. రేఖ అంతగా గుర్తింపు దక్కని కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాల్లోను ఫేమస్. ఇటీవల తెలుగమ్మాయిలకు అవకాశాలివ్వాలంటూ సోషల్ మీడియాల్లో క్యాంపెయినింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.