నా బిడ్డ తండ్రిని అడిగితే ఏమ‌ని చెప్పాలి?

రేణుకాస్వామి హ‌త్య‌కు గుర‌య్యే స‌మ‌యానికి అత‌డి భార్య సుహానా ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. ఇప్పుడామె ప్ర‌స‌వించింది.

Update: 2024-10-16 05:33 GMT

రేణుకాస్వామి హ‌త్య‌కు గుర‌య్యే స‌మ‌యానికి అత‌డి భార్య సుహానా ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. ఇప్పుడామె ప్ర‌స‌వించింది. పండండి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. చిత్రదుర్గ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సహానా డెలివరీ అయింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది. కొడుకు పుట్టాడు? అన్న ఆనందంలో ఆ త‌ల్లి ఉన్నా? ఆ సంతోషం కొన్ని క్ష‌ణాల్లో భారంగా మారిపోయింది. భర్త రేణుకాస్వామిని గుర్తు చేసుకుని కుమిలిపోయింది.

నా బిడ్డ పెరిగి పెద్దాయ్యాక తండ్రి ఎక్క‌డ అని అడిగితే ఏమ‌ని స‌మాధానం చెప్పాల‌ని క్షోభ‌కు గురైంది. ప్ర‌స‌వ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉండాల్సిన భ‌ర్త లేక‌పోవ‌డంతో ఆ బాధ ఎలా ఉంటుందా? తెలుసా అంటూ క‌న్నీరుమున్నీరైంది. రేణుకాస్వామి హత్య తో అతని కుటుంబం తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య వేదన వర్ణనాతీతం. రేణుకాస్వామిని హ‌త్య చేసాడు అనే రోప‌ణ‌తో క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్, అత‌డి ప్రియురాలు ప‌విత్రాగౌడ్ జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

వాళ్ల‌తో పాటు కేసులో మ‌రో 13 మంది ఉన్నారు. ద‌ర్శ‌న్ అరెస్ట్ అయి నాలుగు నెల‌లు గ‌డుస్తోంది.బెయిల్ కోసం శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ఫ‌లించ‌డం లేదు. నిన్న‌టి రోజున బెయిల్ పై విచార‌ణ రాగా ఆ పీటీష‌న్ ని కింద కోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టుకు వెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి బ‌య‌ట ఉండి చూస్తున్నారు.

ప్ర‌స్తుతం ద‌ర్శ‌న్ బళ్లారి జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రప్ప‌న్ అగ్ర‌హారం జైలు నుంచి బ‌ళ్లారికి త‌ర‌లించిన త‌ర్వాత జైల్లో అర్ద‌రాత్రి పూట‌ అరుపులు, కేక‌లు వేస్తున్నాడ‌ని తోటి ఖైదీలు చెబుతున్నారు. అత‌డి మానసిక స్థితి స‌రిగ్గా లేద‌ని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News