ద‌ర్శ‌న్‌కి బెయిల్ వ‌చ్చాక రేణుక‌ తండ్రి వ్యాఖ్య‌లు

రేణుకాస్వామి తండ్రి కాశీనాథ్ శివనగౌడర్ దేశంలోని న్యాయం, న్యాయ వ్యవస్థపై తనకున్న అపారమైన నమ్మకాన్ని ఆయ‌న‌ వ్యక్తం చేశారు.

Update: 2024-10-31 08:13 GMT

జైల్లో ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్నాటక హైకోర్టు 2024 అక్టోబర్ 30న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. నిందితుడైన అత‌డు వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకోవడానికి మెడికల్ ఎమర్జెన్సీ దృష్ట్యా బెయిల్ కోసం కోర్టును అభ్యర్థించారు. అయితే అనేక ఆంక్షలతో పాటు, ఆరు వారాల బెయిల్ వ్యవధిని కోర్టు అనుమతించింది. ఇప్పుడు ఈ కేసులో ఈ కొత్త పరిణామంపై 33 ఏళ్ల బాధితుడు రేణుకాస్వామి తండ్రి త‌న గోడును వినిపించారు.

హ‌తుడు రేణుకాస్వామి తండ్రి కాశీనాథ్ శివనగౌడర్ దేశంలోని న్యాయం, న్యాయ వ్యవస్థపై తనకున్న అపారమైన నమ్మకాన్ని ఆయ‌న‌ వ్యక్తం చేశారు. న్యాయం గెలుస్తుంది. దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయాలనే కర్ణాటక హైకోర్టు నిర్ణయంపై వ్యాఖ్యానించ‌డానికి అత‌డు నిరాక‌రించాడు. అయితే దోషి తను చేసిన త‌ప్పుకు శిక్ష అనుభ‌విస్తాడ‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసాడు. కాశీనాథ్ మాట్లాడుతూ, ''న్యాయ వ్యవస్థ ప్రకారం బెయిల్ మంజూరు అయింది. మేము దానిపై వ్యాఖ్యానించలేము. దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉంది. చట్టంపైనా, పోలీసులపైనా మాకు నమ్మకం ఉంది'' అని అన్నాడు. చికిత్స అనేది డాక్టర్, అతడి(ద‌ర్శ‌న్‌)కి- కోర్టుకు సంబంధించినది.. మేము దానిపై వ్యాఖ్యానించలేమ‌ని అత‌డు వ్యాఖ్యానించాడు.

కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే.. 11 జూన్ 2024న చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామిని హత్య చేశారనే ఆరోపణలపై దర్శన్ తూగుదీపను పోలీసులు అరెస్టు చేశారు. ద‌ర్శ‌న్ తన సహచరులతో కలిసి బెంగళూరు శివార్లలోని ఒక షెడ్‌లో యువకుడిని నిర్భంధించి చిత్రహింసలకు గురిచేశాడు. చివరికి తీవ్ర గాయాలు అతడి మరణానికి దారితీసాయి. బెంగళూరులోని సుమనహళ్లి ప్రాంతంలోని తుఫాను బావి సమీపంలో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. తన లేడీ లవ్ పవిత్ర గౌడకు అనుచితమైన సందేశాలను పంపినందున రేణుకాస్వామిని హ‌త‌మార్చార‌ని నివేదిక అందింది. అయితే అరెస్ట్ రిమాండ్ అనంత‌రం.. బెయిల్ కోసం దర్శన్ చేసిన విజ్ఞప్తిని కర్ణాటక కోర్టులు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించాయి. తాజా విచారణలో నిందితుడైన ద‌ర్శ‌న్‌కి తక్షణ శస్త్రచికిత్స అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన చికిత్స కోసం మ‌ధ్యంత‌ర బెయిట్ ని కండిష‌న్ పై కోర్టు మంజూరు చేసింది.

జైలు అధికారుల‌కు సారీ చెప్పిన ద‌ర్శ‌న్ మ‌ధ్యంత‌ర బెయిల్ పై శ‌స్త్ర చికిత్స కోసం జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ద‌ర్శ‌న్, జైలు అధికారుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని తెలిసింది. త‌న‌కు ఇది కావాలి అది కావాలి! అంటూ డిమాండ్ చేసాన‌ని, దానికి క్ష‌మించాల‌ని ద‌ర్శ‌న్ జైలు అధికారుల‌తో అన్నార‌ట‌. నేనేదైనా త‌ప్పు చేసి ఉంటే క్ష‌మించండి అని కోరార‌ట‌. త‌న‌కు టీవీ కావాల‌ని, కుర్చీ కావాల‌ని ద‌ర్శ‌న్ డిమాండ్ చేసాడ‌ని అప్ప‌ట్లో క‌థనాలొచ్చాయి. ద‌ర్శ‌న్ జైలులో ఉండి సిగ‌రెట్లు కాల్చ‌డం.. త‌న గ్యాంగ్ తో మాట్లాడుతూ క‌నిపించ‌డం.. జైల్లోని గూండాల‌తో క‌లిసి క‌నిపించ‌డం వ‌గైరా ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News