షష్ఠి పూర్తి దాటాక ఆర్జీవీ ఈ వేషాలేంటి?
కథానాయికలతో ఆర్జీవీ సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
60 ప్లస్ ఏజ్ లో చాలా మంది తమకు అన్నీ అయిపోయాయి అనుకుంటారు! కానీ ఆర్జీవీ అలా కాదు. షష్టి పూర్తి వయసులోను మందు ముక్క మగువ అంటూ కులుకుతూ అందరికీ షాక్లిస్తున్నారు. దీనిని పబ్లిసిటీ స్టంట్ అని సరిపెట్టుకోవాలా? లేక రామూజీ నిరంతర అలవాట్లు, రొమాంటిక్ లైఫ్ స్టైల్ ఇలానే ఉన్నాయని అనుకోవాలా? ఏమో తెలీదు కానీ ఇంతకుముందు తన కథానాయికలను ముద్దు పెట్టుకోవడం, ఘాడంగా కౌగిలించుకోవడం... వారిని ఇష్టానుసారం తాకుతూ మందు ఒలకబోస్తూ నానా యాగీ చేసినప్పుడు ఆర్జీవీ కొన్నిటిని పబ్లిసిటీ స్టంట్ కోసం అనుసరిస్తుంటారని గుసగుసలు వినిపించాయి.
కథానాయికలతో ఆర్జీవీ సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇంతకుముందు బిగ్ బాస్ బ్యూటీ, తెలుగమ్మాయి అషురెడ్డితో ఇంటర్వ్యూ పేరుతో ఆర్జీవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అతడి ప్రభావంతో అషుకి అవకాశాలొచ్చాయా లేదా? అన్నది అటుంచితే నాటి బోల్డ్ ఇంటర్వ్యూ చాలా కాలం పాటు యువతరంలో వాడి వేడి డిబేట్ కి తెర తీసింది.
ఇప్పుడు తన `వ్యూహం` కథానాయికతో ఆర్జీవీ మరోసారి చెలరేగిపోయాడు. నైట్ పార్టీలో కాస్త ఒళ్లు మరిచి సదరు భామతో సన్నిహితంగా వ్యవహరిస్తూ నానా యాగీ చేసాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మందు గ్లాసుతో ఓచోట .. సిగరెట్ వెలిగించి ఇంకో చోట.. ఆమెపై చేయి వేసి .. ఎర్రబారిన కళ్లతో హావభావాలు ప్రదర్శిస్తూ ఆర్జీవీ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
ఇప్పటికి వయసు 61.. అయినా ఆర్జీవీ వేషాలు చూస్తుంటే గుబులు పుడుతోంది! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకనైనా ఆర్జీవీ ఈ వేషాలు కట్టిపెట్టి నాణ్యమైన సినిమాలు తీయడంపై దృష్టిప ఎట్టాలని కూడా వారు కోరుకుంటున్నారు. ఇక ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం ఇన్నాళ్లు రిలీజ్ కి రాలేదు. రకరకాల కోర్టు చిక్కుల నుంచి బయటపడి ఎట్టకేలకు రిలీజ్ కి వస్తోందని తాజాగా సమాచారం అందింది.