క్యూట్ గా ఉంటాడు..కానీ ఇద్దరి మధ్య అదేం లేదు!
సీరియల్ నటి రిద్దిమా పండిట్ తో వివాహం జరుగుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
యువ ప్లేయర్ శుభమాన్ గిల్ ఇప్పుడు అమ్మాయిల గుండెల్లో రాకుమారుడైపోయాడు. ఆటతో పాటు అందం అతగాడికి బాగా కలిసొచ్చింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఇతగాడి గురించి నెట్టింట రూమర్లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూ ల్కర్ సైతం అతగాడి ప్రేమలో పడిందంటూ ఓ రేంజ్ లో వైరల్ అయింది.
గ్రౌండ్ లో శుభ్ మాన్ గిల్ సిక్సులు..ఫోర్లు బాదుతుంటే అదే తీరున ప్లైయింగ్ కిస్సులు సైతం విసిరింది. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి అలాంటిదేం లేదని తేలింది. అటుపై జింబాబ్వే టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత శుభ్ మన్ పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. సీరియల్ నటి రిద్దిమా పండిట్ తో వివాహం జరుగుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
విషయం రిద్దిమా వరకూ చేరింది. దీంతో ఆమె లైన్ లోకి వచ్చింది. మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. అతడు మంచి ఆటగాడు. అంతకు మించి శుభమన్ గురించి నాకేం తెలియదు. అతన్ని కలిస్తే మాత్రం ఈ రూమర్లు గుర్తు చేసుకుని కచ్చితంగా నవ్వుకుంటాం. శుభ్ మన్ చాలా క్యూట్ గా ఉంటాడు. అందంగా ఉంటాడు. కానీ స్నేహితుడిగా కూడా అతడితో పరిచయం లేదు. నెట్టింట మాపై జరిగేది అంతా అసత్య ప్రచారం.
వాటిని ఎవరూ నమ్మోద్దని కోరుతున్నా' అని తెలిపింది. వీళ్లిద్దరికంటే ముందే గిల్, నటుడు సైఫ్అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ తో డేటింగ్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. అవి సారా దృష్టికి వెళ్లడంతో వాటిపై స్పందించింది. వాటిలో ఎలాంటి నిజం లేదని తప్పుడు ప్రచారంపై రుస రుసలాడింది.