పాన్ ఇండియా మార్కెట్‌లో రిషబ్ జోరు
ఆ తర్వాత కేజీఎఫ్‌తో యశ్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా స్టార్స్‌గా వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు
బాహుబలితో ప్రభాస్ మొదటి పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచారు. ఆ తర్వాత కేజీఎఫ్‌తో యశ్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా స్టార్స్‌గా వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరికొందరు సైతం పాన్ ఇండియా స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవడంతో పాన్ ఇండియా స్టార్స్‌గా అవతరించారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టికి మంచి గుర్తింపు దక్కింది. ఈయన సైతం పాన్ ఇండియా స్టార్‌డంను సొంతం చేసుకున్నాడు. ఆ స్టార్‌డంను కాపాడుకోవడం కోసం అదే స్థాయి సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తూ, వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నారు.
ఇప్పటికే కాంతార చాప్టర్ 1 సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడం కోసం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో జై హనుమాన్ సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ వర్మ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో ప్రశాంత్ వర్మ హనుమంతుడు పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
కాంతార చాప్టర్ 1, జై హనుమాన్ సినిమాలతో పాటు చత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలోనూ రిషబ్ శెట్టి నటించేందుకు ఓకే చెప్పారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో పది భాషలకు పైగా విడుదల అయ్యే విధంగా శివాజీ మహారాజ్ సినిమాను రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టిని చత్రపతి మహారాజ్‌గా చూపించబోతున్నారు. తాజాగా విడుదల అయిన పోస్టర్‌లో శివాజీ లుక్‌లో రిషబ్ షాక్ అయ్యారు. నిజంగా శివాజీ మహారాజ్‌ను చూసినట్లుగా ఉందంటూ మరాఠా ప్రేక్షకులు సైతం ఫస్ట్ లుక్‌కి ఇంప్రెస్ కావడంతో జరిగింది.
పాన్ ఇండియా స్టార్ హీరోలు అంటే ఇప్పటి వరకు ప్రభాస్, యశ్ మరికొందరి పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు ఆ జాబితాలో మరోస్టార్‌గా రిషబ్ శెట్టి పేరు ప్రముఖంగా వినిపించబోతుంది. ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలను సొంతం చేసుకుంటే పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా రిషబ్ శెట్టిని మరింతగా ప్రేక్షకులు అభిమానించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ కి పాన్ ఇండియా స్థాయిలో గట్టి పోటీ ఇచ్చేందుకు యశ్ తో పాటు కన్నడ మరోసార్ అయిన రిషబ్ శెట్టిలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.