కాంతార హీరో.. టాలీవుడ్ ఆఫర్లు గట్టిగానే..

అయితే ఇప్పుడు రెండు పెద్ద ప్రొడక్షన్స్ లో పాన్ ఇండియా మూవీస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2024-10-20 07:30 GMT

‘కాంతార’ మూవీతో దేశ వ్యాప్తంగా అందరూ చర్చించుకునేలా చేశాడు కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి. విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రిషబ్ శెట్టి ‘రిక్కీ’ అనే మూవీతో దర్శకుడిగా కూడా మారాడు. అయితే రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ‘కిరీక్ పార్టీ’ అతనికి దర్శకుడిగా సూపర్ సక్సెస్ ఇచ్చింది. డైరెక్టర్ గా రిషబ్ శెట్టి చాలా తక్కువ సినిమాలు చేశాడు. హీరోగా భిన్నమైన కథలతో మూవీస్ చేస్తూ వస్తున్నాడు.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘కాంతార’ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అతనికి సూపర్ సక్సెస్ ఇచ్చింది. ఈ చిత్రం ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీని తర్వాత అతని ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ‘కాంతార’ మూవీకి నటుడిగా నేషనల్ అవార్డుని సైతం రిషబ్ శెట్టి అందుకున్నాడు. ప్రస్తుతం ‘కాంతార’ కి ప్రీక్వెల్ గా ‘కాంతారా 2’ తెరకెక్కుతోంది. 150 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ మూవీ సిద్ధం ఆవుతోన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ యాక్టర్ టాలీవుడ్ లో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సినిమాలో క్యామియో రోల్ చేశాడు. అయితే ఇప్పుడు రెండు పెద్ద ప్రొడక్షన్స్ లో పాన్ ఇండియా మూవీస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో రిషబ్ శెట్టి ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడంట. అయితే దీనికి ఎవరు దర్శకుడు అనేది తెలియదు. ‘కాంతార’ తర్వాత నిర్మాత నాగవంశీ రిషబ్ శెట్టికి అడ్వాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పారంట. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ చేయనున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఈ మూవీలో ‘హనుమాన్’ క్యారెక్టర్ కోసం రిషబ్ శెట్టిని కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే వీటిపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. సరైన టైం చూసుకొని ఈ రెండు సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందంట.

‘హనుమాన్’ పాత్రలో కనిపించడానికి రిషబ్ శెట్టి కూడా చాలా క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారని టాక్. ‘కాంతారా 2’ తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ చిత్రం పైన దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ హిట్ అయితే నెక్స్ట్ రిషబ్ శెట్టి నుంచి రాబోయే సినిమాలపై అంచనాలు మరింత పెరిగిపోతాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News