హాట్ వీడియోల‌ సెర్చ్ ఇలా దొరికేసాడేంటి!

ఈసీజ‌న్ ఐపీఎల్ లో రియాన్ ప‌రాగ్ పేవ‌రెట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అత్య‌ధిక ప‌రుగుల‌తో ప‌రాగ్ సునామీ సృష్టించాడు

Update: 2024-05-28 11:49 GMT

ఈసీజ‌న్ ఐపీఎల్ లో రియాన్ ప‌రాగ్ పేవ‌రెట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అత్య‌ధిక ప‌రుగుల‌తో ప‌రాగ్ సునామీ సృష్టించాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆడియ‌న మ్యాచ్ ల్లో ప‌రాగ్ స్పెష‌ల్ గా నిలిచాడు. ఇలా ఆట వ‌ర‌కూ ప‌రాగ్ క్రేజ్ మామూలుగా లేదు. కానీ ఇత‌గాడిలో మ‌రో కోణం కూడా ఉంద‌న‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం మ్యాచ్ లు లేక‌పోవ‌డంతో రిలాక్స్ అవుతున్నాడు. అయితే తన యూట్యూబ్‌ చానల్‌ లైవ్‌తో చిక్కుల్లో పడ్డాడు.

తన యూట్యూబ్‌లో హీరోయిన్ల హాట్‌ వీడియోలు వెతుకుతున్న సెర్చింగ్‌ వివరాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల హాట్ వీడియోలు సెర్చ్ చేస్తున్నాడ‌ని నెటి జ‌నులు మండిప‌డ్డారు.యూట్యూబ్ సెర్చ్ హిస్ట‌రీలో అభ్యంతరకరమైన కంటెంట్‌ ఉండడంతో పరాగ్ ట్రోల‌ర్ల‌కు అడ్డంగా దొరికాడు. అన‌న్యా పాండే..సారా అలీఖాన్ హాట్ వీడియెలు అని టైప్ చేసి సెర్చ్ చేసిన‌ట్లు ప‌రాగ్ ఖాతాలో కనిపించింది.

ప‌రాగ్ త‌న స‌ర్స‌న‌ల్ సెర్చ్ ఇంజిన్ హైడ్ చేయ‌కపోవ‌డంతో వ‌చ్చిన స‌మ‌స్య ఇది. లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తున్న క్రమంలో అవి బయటపడడంతో నెటిజన్లు స్క్రీన్‌ షాట్లు తీసి మారి ప‌రాగా భాగోతాన్ని బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నం చేసారు. నెట్టింట ఇది వైర‌ల్ గా మారింది. ప‌రాగ్ తీరుపై ర‌క‌ర‌కాల కామెంట్లు క‌నిపిస్తున్నాయి. ఇత‌డు క్రికెట్ ఆట‌లోనే కాదు..ఆ ఆట‌లో కూడా స్పెష‌లిస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి వీటిపై ప‌రాగ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.

ఇలాంటి వీడియోలు సెర్చ్ చేసేన క్రికెట‌ర్లు గ‌తంలో చాలా మంది ఉన్నారు. కానీ అప్పుడు చేతిలో స్మార్ట్..నెట్ వినియోగం అంత‌గా లేని రోజులు. దీంతో వారి పేర్లు కేవ‌లం పేప‌ర్ ..టీవీ ఛాన‌ల్ వ‌ర‌కే ప‌రిమ‌త‌మ‌య్యాయి. కానీ నేడు సీన్ వేరు. చేతిలో ఫోన్ ఉంద‌ని ఏది ప‌డితే అది కెలికితే ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వు. అందులోనూ ఆద‌ర్శంగా నిల‌వాల్సిన వారు , సోసైటీలో పేరున్న వారు ఇలా చేస్తే ప‌రిణామాలు ఇలాగే ఉంటాయి.

Tags:    

Similar News