RRR ఆ ఇంట్రో సీన్ వెనక అంత కథ ఉందా?
అయితే ఆ సీన్ మొదట్లో నెగిటివ్ షేడ్‌లో కనిపించినా కానీ, రామరాజు పాత్ర ప్రజలకు ఎంతో కనెక్టవుతుందని రాజమౌళి భావించారు.
ఒక భారతీయుడు అమాయక భారతీయ ప్రజలను చితక్కొట్టాలి! అది కూడా ఆంగ్లేయుల మనిషిగా, వారు సృష్టించిన అధికారిగా ఒక వెపన్ లాగా దూసుకొచ్చి భారతీయ ప్రజలను చితక్కొట్టాలి. ఇలాంటి సీన్ లో ఉద్వేగం పండిండం కోసం నటుడు చేయాల్సినది చాలా ఉంటుది. అదేమీ ఆషామాషీ కాదు. ఎంపిక చేసిన సీన్ నెగెటివ్ సెన్స్ ని రాజేస్తుంది. ముఖ్యంగా ఈ సీన్ లో నటించే హీరోపై దాని ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు.
నిజానికి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో సీతారామరాజు పరిచయ సన్నివేశం తెరకెక్కించే ముందు చరణ్ లో ఎన్నో సందేహాలు. ఒక నెగెటివ్ సీన్ లో తాను నటించడం వల్ల ప్రజల రిసీవింగ్ ఎలా ఉంటుందోనని సందేహించాడు. ఆ సందేహాన్ని జక్కన్న ముందే వ్యక్తం చేసాడు కూడా. వేలాదిమంది భారతీయులను పోలీస్ అధికారి హింసించాలి. తన మనుషులకు తానే ఎదురెళ్లాలి. చరణ్ బ్రిటిష్ పాలనలో పోలీసు అధికారిగా కనిపించాలి.
అయితే ఆ సీన్ మొదట్లో నెగిటివ్ షేడ్‌లో కనిపించినా కానీ, రామరాజు పాత్ర ప్రజలకు ఎంతో కనెక్టవుతుందని రాజమౌళి భావించారు. చివరికి ఆయన కాన్ఫిడెన్స్ నిజమైంది. రామరాజు పాత్ర చరణ్ కెరీర్ బెస్ట్ రోల్ గా నిలిచిందనడంలో సందేహం లేదు. పవర్ ఫుల్ కాప్ పాత్రలో చరణ్ నటనను బ్రిటీష్ ప్రజలు కూడా విపరీతంగా మెచ్చుకున్నారు. బ్రిటీష్ స్టార్లు సైతం అతడి నటనను కొనియాడారు. అమెరికన్లు, ఇండియన్లు, ఇతర విదేశీయులు రామరాజు పాత్రతో ప్రేమలో పడిపోయారు. అంతేకాదు.. హాలీవుడ్ కథానాయిల నుంచి చరణ్ కి ఫీలర్స్ కూడా అందాయి. అంతగా ఆ సన్నివేశం కుదిరింది. అందులో ఎమోషన్ పండింది.
ఈ కీలక సన్నివేశాన్ని రామోజీ ఫిలింసిటీలో ఏకంగా 30 రోజుల పాటు చిత్రీకరించారు. నిజానికి ఈ సీన్ లో ఒక భారతీయుడిగా భారతీయ ప్రజల్ని కొట్టడాన్ని చరణ్ మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు. అతడు యాంత్రికంగా మాత్రమే వారిని కొట్టాడు.. మంచి ప్రీప్రొడక్షన్ ప్లానింగ్ కారణంగా ఈ సీన్ ని బాగా చేయగలిగామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కూడా తెలిపారు. ఈ సన్నివేశానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని బాటిల్ ఆఫ్ బాస్టర్డ్స్ సీక్వెన్స్ స్ఫూర్తి. కానీ రాజమౌళి తనదైన శైలిలో సీన్ ని పండించడంతో అది అభిమానులకు బాగా కనెక్టయింది.