పిక్ టాక్ : తెల్ల గులాబీ చేత పట్టిన మెరిసే గులాబీ

చి.ల.సౌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు దక్కించుకుంది.

Update: 2023-11-18 05:27 GMT

చి.ల.సౌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. టాలీవుడ్‌ లో రాణించాలి అంటే నటనతో కంటే అందాల ఆరబోతతో మంచి మార్కులు దక్కించుకోవాల్సి ఉంటుంది. అందుకే మొదటి సినిమా హిట్ అయినా రుహానికి ఎక్కువ ఆఫర్లు రాలేదు.


హిట్‌, డర్టీ హరి సినిమాల్లో నటించి మరోసారి నటిగా మెప్పించిన రుహాని ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత తో ఆకట్టుకుంటూ ఉంది. డర్టీ హరి సినిమాలో చీర కట్టులో కూడా అందంగా హాట్ గా కనిపించిన రుహాని ఇక మీదట వెండి తెరపై స్కిన్‌ షో చేసేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పకనే చెప్పింది.


సినిమాల్లో ఇప్పటి వరకు పెద్దగా హాట్ అందాల ఆరబోత చేయని ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో మాత్రం స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తూనే ఉంది. తాజాగా తెల్లటి చీర కట్టుతో కన్నుల విందు చేస్తోంది. హీరోయిన్స్ హాట్ గా రొమాంటిక్ గా కనిపించాలి అంటే తెల్లటి చీర కట్టుకోవాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.


రుహాని శర్మ రొమాంటిక్ లుక్ కోసం ఇలా తెల్ల చీర కట్టి క్లీ వేజ్ షో చేసింది. తెల్ల చీర కట్టి తెల్ల గులాబీ చేతిలో పట్టుకుని సిగ్గు పడుతూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ రేంజ్ లో అందంగా ఉన్న రుహాని శర్మను స్టార్‌ హీరోలు, ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత అయినా రుహానికి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.


Tags:    

Similar News