.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఆఫ్టర్ గ్యాప్ అదిరిపోయే ఛాన్స్..!

టాలెంటెడ్ బ్యూటీ రుహాని శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. వెండితెర మీద అమ్మడు తన అభినయంతో మెప్పిస్తూ అదరగొట్టేస్తుంది

Update: 2024-07-01 12:30 GMT

టాలెంటెడ్ బ్యూటీ రుహాని శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. వెండితెర మీద అమ్మడు తన అభినయంతో మెప్పిస్తూ అదరగొట్టేస్తుంది. రుహాని శర్మకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తుంది అనే నమ్మకాన్ని కలిగేలా చేసుకుంది. తెలుగులో చిలసౌ తో పరిచయమై వరుస సినిమాలు చేస్తుంది. ఐతే తెలుగులో ఆమె ప్రతిభకు తగిన స్టార్ ఛాన్స్ రాలేదని చెప్పాలి. ఇదిలాఉంటే అమ్మడు తెలుగు కన్నా ముందు కోలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకుంది.

2017 లోనే రుహాని శర్మ హీరోయిన్ గా కడసీ బెంచ్ కార్తీ సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో కోలీవుడ్ లో ఆమెను పట్టించుకోలేదు. అక్కడ ఛాన్సులు రాకపోయినా తెలుగు, హిందీలో రాణిస్తుంది అమ్మడు. ఈమధ్య సోషల్ మీడియాలో అమ్మడి హంగామా చూసి మళ్లీ తమిళ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. ఈసారి ఏకంగా స్టార్ హీరో కవిన్ కు జంటగా నటించే ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. అది కూడా వెట్రిమారన్ లాంటి డైరెక్టర్ నిర్మిస్తున్న సినిమా అవ్వడం విశేషం.

మన దగ్గర టాలెంట్ ఉంటే మళ్లీ కాదన్న వారే పిలిచి అవకాశం ఇస్తారన్న దానికి రుహాని కోలీవుడ్ ఆఫరే ఉదహరణగా చెప్పొచ్చు. 7 ఏళ్ల క్రితం ఒక సినిమా చేయగా ఆ సినిమా ఆడకపోగా అమ్మడిని ఎవరు పట్టించుకోలేదు. ఐతే అక్కడితే నిరాశ చెందకుండా రుహాని తెలుగులో రాణించింది. ఆ తర్వాత హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అలా మళ్లీ పాపులర్ అయ్యి తమిళ ఆఫర్ అందుకుంది.

7 ఏళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ అదిరిపోయే ఆఫర్ తో రుహాని అదరగొట్టనుంది. సినిమాల్లో ఎలా ఉన్నా రుహాని సోషల్ మీడియాలో మాత్రం నో కాంప్రమైజ్ అనేలా రెచ్చిపోతుంది. శర్మా ఫ్యామిలీ గర్ల్ అంటే సత్తా చాటాల్సిందే అనే రేంజ్ లో రెచ్చిపోతుంది అమ్మడు. రుహాని ఇన్ స్టాగ్రాం లో షేర్ చేస్తున్న ఫోటోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అమ్మడు తను ఏం చేసినా సరే ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ముందుంటుంది. తెలుగు, హిందీనే కాదు ఇప్పుడు కోలీవుడ్ ఆడియన్స్ ని సైతం రుహాని శర్మ తన బుట్టలో వేసుకోవాలని చూస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News