ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' హీరోయిన్‌ ఎవరో తెలుసా...!

తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ ను సంప్రదించారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Update: 2024-06-24 05:29 GMT

ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరో వైపు హిందీ వార్‌ 2 సినిమాలో కూడా హృతిక్‌ రోషన్ తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉండగానే ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

 

ఆ మధ్య ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ ని ఆగస్టు లో ప్రారంభించబోతున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే స్క్రిప్ట్‌ వర్క్ ను కూడా దర్శకుడు పూర్తి చేశాడనే వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సలార్‌ 2 షూటింగ్‌ ఇంకా పూర్తి అవ్వకుండానే ఎన్టీఆర్ తో డ్రాగన్ ను షురూ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడట.

ఇటీవల డ్రాగన్ సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ ను సంప్రదించారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు ముంబై వెళ్లి ఆలియాను సంప్రదించారని తెలుస్తోంది.

ఆలియా నుంచి గ్రీన్ సిగ్నల్‌ వస్తే ప్రశాంత్‌ నీల్‌ కథ చెప్పేందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మరోసారి ఆలియా భట్‌ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.

ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ నటించింది. కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేక పోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆమె ఆర్‌ఆర్‌ఆర్ మేకర్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అయినా ఆలియా భట్‌ కి మంచి పాత్ర దక్కేనా చూడాలి.

Tags:    

Similar News