లైలా క‌థ విని ముగ్గురు హీరోలు వెనుక‌డుగేశారు: సాహు గార‌పాటి

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా రామ్‌ నారాయణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా లైలా.

Update: 2025-02-08 11:55 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా రామ్‌ నారాయణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా లైలా. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఫిబ్రవరి 14న‌ వాలెంటైన్స్ డే సందర్భంగా లైలా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాహు గారపాటి మీడియాతో లైలా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

లైలా సినిమా చేయ‌డానికి మెయిన్ రీజ‌న్ కామెడీ అని, దానికి తోడు ఇలాంటి క‌థ‌లు తెలుగులో వ‌చ్చి చాలా రోజులైంద‌నిపించింద‌ని, ఒక‌ హీరో ఇలాంటి పాత్ర‌ను చేయ‌డానికి ముందుకు రావ‌డం కూడా స‌వాలేన‌ని, గ‌తంలో తాను ఇదే క‌థ‌ను ముగ్గురు హీరోల‌తో డిస్క‌స్ చేయ‌గా, లేడీ గెట‌ప్ అన‌గానే వాళ్లు వెనుక‌డుగేశార‌ని, కానీ విశ్వ‌క్ క‌థ విన్న‌ వెంట‌నే ఓకే చేశాడ‌ని నిర్మాత ఈ సంద‌ర్భంగా తెలిపాడు.

అయితే సినిమాలో సోనూ, లైలా అనే రెండు పాత్ర‌ల్లో విశ్వ‌క్ క‌నిపించ‌నున్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఆ రెండు పాత్ర‌ల‌కూ ఇంచుమించు ఒకే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని, సినిమాలో త‌ల్లి సెంటిమెంట్ కూడా ఉంద‌ని, ఆ సెంటిమెంట్ అంద‌రినీ మెప్పిస్తుందన్నాడు. అలాగే ట్రైల‌ర్ చూశాక చాలా మంది సినిమాలో అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉందంటున్నారు. లైలాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిన మాట నిజ‌మే అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వ‌చ్చే అడ‌ల్ట్ కంటెంట్ తో పోలిస్తే త‌మ సినిమాలో ఉన్న‌ది చాలా త‌క్కువ‌ని ఆయ‌న తెలిపాడు.

ట్రైల‌ర్ చూశాక లైలా సినిమా యూత్ ను టార్గెట్ చేసి తీశారా అంటున్నార‌ని, కానీ అదేం లేద‌ని, ఆడియ‌న్స్ ను న‌వ్వించ‌డ‌మే త‌మ టార్గెట్ అని, ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యామ‌ని ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత అర్థ‌మైంద‌ని సాహు అన్నాడు. మెగా స్టార్ చిరంజీవి గారు ట్రైల‌ర్ చూసి చాలా ఎంజాయ్ చేశార‌ని, ఇండ‌స్ట్రీలో ఇలాంటి కొత్త ప్ర‌యోగాలు ఇంకా ఇంకా రావాల‌ని ఆయ‌న ప్రోత్స‌హించార‌ని చెప్పిన సాహు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరూ గెస్టు గా వ‌స్తున్నట్టు మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు.

2.10 గంట‌ల ర‌న్ టైమ్ తో రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలో కోయ్ కోయ్ అనే పాట‌ను తీసుకోవ‌డానికి కార‌ణం కేవ‌లం ఆ సాంగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండ‌ట‌మేన‌ని, ఆ సాంగ్ పాడిన వ్య‌క్తిని సంప్ర‌దించాకే దాన్ని సినిమాలో వాడుకున్న‌ట్టు సాహు తెలిపాడు. లైలా సినిమాకు విశ్వ‌క్ 100% న్యాయం చేశాడ‌ని, ఈ సినిమా త‌ర్వాత నటుడిగా ఆయ‌న‌కు చాలా మంచి పేరొస్తుంద‌ని సాహు భావిస్తున్నాడు.

Tags:    

Similar News