స్టార్ హీరోయిన్ మైండ్ బ్లాక్ డిమాండ్..!

మలయాళంలో ప్రేమమ్ చేసిన ఆమె తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు.

Update: 2024-12-31 04:35 GMT

సౌత్ లో స్టార్ హీరోయిన్స్ లో స్పెషల్ ఇమేజ్ తో దూసుకెళ్తుంది సాయి పల్లవి. ఆమె ఒక సినిమా సైన్ చేసింది అంటే అది సూపర్ హిట్ అన్నట్టే అనే సెంటిమెంట్ ఏర్పడింది. మలయాళంలో ప్రేమమ్ చేసిన ఆమె తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. స్టార్ హీరోయిన్ గా ఏ సినిమా పడితే ఆ సినిమా అన్నట్టు కాకుండా తన మనసుకి నచ్చిన కథలనే చేస్తూ వస్తుంది సాయి పల్లవి.

ఐతే స్టార్ ఆన్ డిమాండ్ అన్నట్టు సాయి పల్లవి తన క్రేజ్ కు తగినట్టుగానే రెమ్యునరేషన్ వసూలు చేస్తుందని టాక్. సౌత్ సినిమాలు ముఖ్యంగా తనకు ఈ రేంజ్ డిమాండ్ ఏర్పడటానికి సహాయ పడిన తెలుగు సినిమా నుంచి ఆఫర్ వస్తే మాత్రం కథ నచ్చితే రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించదట సాయి పల్లవి. అలా అని ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది అని కాదు. మొదట్లో కోటి దాకా తీసుకున్న అమ్మడు వరుస హిట్ల వల్ల మూడు కోట్ల దాకా పెంచింది.

ఇక ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అదరగొట్టేస్తుంది కాబట్టి  ఐదు కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని అంటున్నారు. ఐతే ఇదే ఊపుతో బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంటుంది సాయి పల్లవి. అక్కడ మాత్రం 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్. ఐతే అందరి హీరోయిన్స్ లా ఇంత ఇస్తేనే చేస్తా అని కాకుండా కథ నచ్చి కాంబినేషన్స్ బాగుంటే రెమ్యునరేషన్ కాస్త అటు ఇటు అయినా సాయి పల్లవి చేసేస్తుందని తెలుస్తుంది.

ఈ ఇయర్ అమరన్ తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ నాగ చైతన్యతో తండేల్ సినిమా తో రాబోతుంది. తండేల్ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణ్ తో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లు చేస్తుంది. ఐతే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సరే సాయి పల్లవి గ్లామర్ షో చేయదు ఇంకా కేవలం రెమ్యునరేషన్ కోసం మాత్రమే సినిమాలు చేయదు. అందుకే ఆమె అంటే ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పరచుకుంది.

Tags:    

Similar News