మామయ్య దారిలో మెగా అల్లుడు!
మునుపటిలా మళ్లీ తప్పిదాలు దొర్లకుండా వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని కథల విషయంలో ఆచితూచి వెళ్తున్నాడు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ కెరీర్ `విరూపాక్ష`తో ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో ని ఆ చిత్రం వందకోట్ల క్లబ్ లో చేర్చింది. వెనుక ఎన్నో వైఫల్యాలు ఉన్నా! సరైన కథతో సినిమా చేస్తే..ఇమేజ్ తో పనిలేకుండా ఆదరిస్తారని విరూపాక్ష నిరూపించడంతోనే తేజ్ ఆ రేంజ్ వసూళ్లని సాధించగలిగాడు. మునుపటిలా మళ్లీ తప్పిదాలు దొర్లకుండా వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని కథల విషయంలో ఆచితూచి వెళ్తున్నాడు.
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో `గాంజా శంకర్` లో నటిస్తున్నాడు. ఈసంతోషంలోనే ఆదివారం ఆయన పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మరోసారి తన దాతృహృదయాన్ని చాటుకున్నాడు. మూడో మామయ్య పవన్ కళ్యాణ్ ని స్పూర్తిగా తీసుకుని భద్రత కోసం పాటు పడేవారి కోసం తనవంతు విరాళం ప్రకటించారు. భారతదేశ సైన్యం కోసం రూ. 10 లక్షలు విరాళం అందజేశారు. అలాగే ఆంధ్రా.. తెలంగాణ అకాడమీలకు చెరొక 5 లక్షలు ఇచ్చారు.
గత ఏడాది కూడా తేజ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధుల కోసం విజయవాడలో ఓ బిల్డింగ్‌ను కూడా కట్టించారు. ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతే కాదు అభిమానులు కూడా తమవంతుగా పలు సేవ కార్యక్రమాలు చేశారు. అయితే ప్రత్యేకంగా భారతసైన్యానికి విరాళం ఇవ్వడం అన్నది పవన్ కళ్యాణ్ ని స్పూర్తిగా తీసుకుని చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా తన పుట్టిన రోజు సందర్భంగానే భారతసైన్యానికి భారీ విరాళం అందించారు.
ఇలా సైన్యం కోసం ఇవ్వడం ఇదే తొలిసారి. ఆయన సైలెంట్ గా సహాయాలు చేస్తారు తప్ప చేసిన సాయం గురించి పెద్దగా చెప్పుకోరు. కానీ ఈసారి పీకే రాజకీయంగా యాక్టివ్ గా ఉండటంతో చేసే ప్రతీ సహాయం అన్నిచోట్లా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తేజ్ కూడా దేశం కోసం ముందడుగు వేయడం ప్రశంసనీయం.