బీచ్‌లో మేజర్ బ్యూటీ స్ట్రైకింగ్ ఫోజ్
నేటితరంలో సోషల్ మీడియాల్లో స్పీడున్న భామగా సయీ మంజ్రేకర్ సుపరిచితురాలు.
నేటితరంలో సోషల్ మీడియాల్లో స్పీడున్న భామగా సయీ మంజ్రేకర్ సుపరిచితురాలు. తాజాగా సయీ షేర్ చేసిన బీచ్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. వీటిలో సయీ వైట్ టాప్ ధరించి కాంబినేషన్ బ్లాక్ షేడ్స్ లో మతులు చెడగొడుతోంది. బాటమ్ ని కవర్ చేస్తూ పింక్ టవల్ ని చుట్టుకుంది ఈ బ్యూటీ. బీచ్ ఇసుకలో షాపింగ్ ఏరియా నుంచి సయీ మంజ్రేకర్ వీక్షణకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. బీచ్ పరిసరాల్లో అందమైన షాపింగ్ ప్లేస్ కి సంబంధించిన ఫోటోలను సయీ షేర్ చేసింది. అలాగే సముద్రంలో జలకాలాటలకు సిద్ధమవుతున్నప్పటి ఓ బికినీ ఫోజ్ కూడా ఈ ఫోటోషూట్ లో కనిపించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. `మేజర్` లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటించిన సయీ ముఖర్జీ ప్రస్తుతం తెలుగు-హిందీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు తమిళంలోను ఈ భామకు అవకాశాలొస్తున్నాయి. దబాంగ్ 3తో కెరీర్ ప్రారంభించిన సయీ మంజ్రేకర్ తన తొలి చిత్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ పై ఎప్పటికీ తన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది.
ఇక తన తండ్రి మహేష్ మంజ్రేకర్ గురించి మాట్లాడుతూ.. ఆయన తన నిర్ణయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోరని తెలిపింది. నాన్న ఒక దర్శకుడిగా నాకు ఉత్తమమైన సలహా ఇస్తాడు. కానీ నా సినిమా చూసిన తర్వాత చాలా నిర్మాణాత్మక విమర్శలు కూడా చేస్తారని వెల్లడించింది. తన నటన గురించి రివ్యూలు చేస్తాడని, ఇంకా ఉత్తమంగా ఎలా నటించాలో వివరిస్తారని కూడా తెలిపింది.
తదుపరి అజయ్ దేవగన్, టబు లాంటి జాతీయ ఉత్తమ తారలతో కలిసి సయీ మంజ్రేకర్ పని చేస్తోంది. ఔరాన్ మే కహన్ దమ్ థా (అనువాదం. వేర్ డిడ్ అదర్స్ హావ్ ద కరేజ్) అనేది మూవీ టైటిల్. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ థ్రిల్లర్ లో దేవగన్, టబు కలిసి వారి పదవ చిత్రంలో నటించారు. జిమ్మీ షీర్‌గిల్, శాంతను మహేశ్వరి- సాయి మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. M. M. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరాన్ మే కహన్ దమ్ థా 5 జూలై 2024న విడుదల కావాల్సి ఉంది. అయితే ఫిల్మ్ ఎగ్జిబిటర్లు మరియు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌ల అభ్యర్థన మేరకు విడుదల 2 ఆగస్ట్ 2024కి వాయిదా పడింది.