సైఫ్‌కి 53.. బెబోకి 42.. అయినా కానీ తగ్గేదేలే!
నేను బార్బీ.. ఆమె కెన్ని చూస్తున్నాను! అంటూ ఈ జంట పోటోకి స్పందించాడో అభిమాని. కరీనా - సైఫ్ 2012 లో వివాహం చేసుకున్నారు.
ఆయనకు 53.. ఆమెకు 42.. అయినా కానీ.. రోమాంచితమైన దినచర్యలో ఎక్కడా తగ్గరు. ప్రకృతి దృశ్యాల నడుమ అందమైన వెకేషన్ ని ఆస్వాధించడానికి మొహమాటపడరు. ఇప్పుడిలా మరోసారి రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్నారు. పూల్ సైడ్ రిలాక్స్ అవుతూ ఈ జంట కనిపిస్తున్న తీరు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కరీనాకపూర్ ఖాన్ తన హబ్బీ సైఫ్ అలీ ఖాన్ 53వ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఉద్విగ్నంగా స్పందించింది. తన భర్త గురించి లాంగ్ నోట్ రాసింది. సైఫ్ అలీ ఖాన్ ఈ రోజు ఒక సంవత్సరం పెద్దయాడు అని తెలిపింది.
ఈ పుట్టినరోజు…ఎప్పుడూ ఇలా రిలాక్స్‌గా ఉండండి, నా జాన్...నా అల్టిమేట్ లవర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...నిజంగా మీలాంటి వారు ఎవరూ లేరు...దయ, ఉదారత, వెర్రి...సరే, నేను రోజంతా రాస్తూనే ఉంటాను...కానీ కేక్ తినడానికి వెళ్లాలి'' అంటూ కరీనా తన ప్రేమను కురిపించింది.
అభిమానులు- పరిశ్రమ స్నేహితులు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మలైకా అరోరా, కరిష్మా కపూర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేయగా... సోనమ్ కపూర్, జోయా అక్తర్, అమృత అరోరా 'సైఫు డే' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది అభిమానులు ఈ ప్రేమ జంట 'ఎంతో ఆరాధ్యమైనది' అని వ్యాఖ్యానించారు. నేను బార్బీ.. ఆమె కెన్ని చూస్తున్నాను! అంటూ ఈ జంట పోటోకి స్పందించాడో అభిమాని. కరీనా - సైఫ్ 2012 లో వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ జంట అభిమానుల్లో కపుల్ గోల్స్‌ను సెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇక 50 ప్లస్ లోను సైఫ్ ఎంతో ఎనర్జిటిక్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. నటుడిగా అతడు కెరీర్ లో గొప్ప హైట్స్ ని ఆస్వాధిస్తున్నాడు.