భాషలు..యాసలు ఆమెకి కొట్టిన పిండే!
సాయి పల్లవి క్రేజ్ గురించి..ట్యాలెంట్ గురించి చెప్పేదేముంది. పక్కింటి పిల్లలా తెలుగు అభిమానలకు దగ్గరైన హీరోయిన్
సాయి పల్లవి క్రేజ్ గురించి..ట్యాలెంట్ గురించి చెప్పేదేముంది. పక్కింటి పిల్లలా తెలుగు అభిమానలకు దగ్గరైన హీరోయిన్. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వస్తూనే తెలంగాణ యాస భాషతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. `ఫిదా` సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుని నేచురల్ పెర్పార్మన్ అనిపించింది. అప్పటినుంచి తెలంగాణ పిల్లాగా ఫేమస్ అయిపోయింది.
నాటి నుంచి తాను ఏ సినిమా చేసినా? తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇతర భాషల్లోనూ అదే ట్రెండ్ నికొనసాగిస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన `తండేల్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఉత్తరాంద్ర జాలర్ల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. దీంతో ఈ పాత్రకోసం కూడా అమ్మడు ప్రత్యేకంగా సన్నధం అవుతోంది. ప్రస్తుతం సాయిపల్లవి ఉత్తరాంధ్ర యాస కూడా నేర్చుకుంటుంది.
అందుకు ప్రత్యేకమైన ట్రైనర్ నియమించుకుని ఉదయం..సాయంత్రం అదే పని మీద ఉంటుందిట. ఆ రకంగా శ్రీకాకుళం..విజయనగరం..విశాఖ యాసలు అమ్మడు అవపోశాన పట్టేస్తున్నట్లుంది. అలాగే బాలీవుడ్ `రామాయణ్` సినిమాలో సీత పాత్రకి అమ్మడు ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ పాత్రకి సంబంధించి హిందీ కూడా నేర్చుకుంటుందిట. సీత పాత్ర..ఆహార్యాన్ని బట్టి భాష ఎలా మాట్లాడితే బాగుంటుంది? అన్న దానిపై దృష్టి పెట్టిందిట.
దానికి సంబంధించినార్త్ నుంచి ఓ హిందీ ట్రైనర్ ని నియమించుకుందిట. ఇలా అమ్మడు ఏ భాషలోకి వెళ్తే ఆ భాషని అవపోశాన పట్టేస్తున్నట్లే కనిపిస్తుంది. తెలుగు... తమిళం.. మలయాళం ఇప్పటికే తెలిసిన భాషలు. హిందీని లైన్ లో పెట్టేసింది. కన్నడలో ఇంకా లాంచ్ అవ్వలేదు. అక్కాడా ఎంట్రీ ఇస్తే ఆ భాష నేర్చేస్తుంది. అదీ సాయి పల్లవి ట్యాలెంట్.