సలార్ 2 ఆలస్యం.. ఎందుకంటే?

ఈ ఏడాదిలోనే ఏదో ఒక నెలలో స్టార్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ అనూహ్యంగా ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.

Update: 2024-08-06 14:24 GMT

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా 700 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంతకుముందు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ తో హ్యాట్రిక్ డిజాస్టర్స్ అందుకున్నారు. ఈ సినిమాలు ప్రభాస్ ఇమేజ్ ని కూడా కొంతమేరకు దెబ్బతీశాయి. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి.

ఈ లుక్స్ చూసిన తర్వాత ప్రభాస్ పని అయిపోయిందని చాలా మంది విమర్శలు చేశారు. మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. అయితే సలార్ సినిమాతో ప్రభాస్ మరల తన స్టామినా చూపించారు. అందులో బలమైన దేవా క్యారెక్టర్ కి ప్రభాస్ పూర్తిస్థాయిలో న్యాయం చేసాడు. ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ లుక్స్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే సూపర్ హీరో తరహాలో దేవా క్యారెక్టర్ సలార్ లో ఉంటుంది.

ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ని సలార్ మూవీలో అద్భుతంగా ఎలివేట్ చేశాడు. దీంతో సలార్ కి సీక్వెల్ గా రాబోయే శౌర్యంగ పర్వం పైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఖాన్సార్ మెయిన్ కథ అంతా కూడా ఈ శౌర్యంగ పర్వంలోనే ఉండబోతోందని కూడా సలార్ మూవీ క్లైమాక్స్ తో రివీల్ అయ్యింది. దీంతో ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సీక్వెల్ షూటింగ్ ఏడాదిలో స్టార్ట్ చేసి 2025 ఆరంభంలో రిలీజ్ చేస్తారనే ప్రచారం నడిచింది.

అయితే ఎందుకనో మూవీ ఆలస్యం అవుతునే వస్తోంది. ఈ ఏడాదిలోనే ఏదో ఒక నెలలో స్టార్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ అనూహ్యంగా ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. ఈ నెలలోనే డ్రాగన్ మూవీ లాంచింగ్ ఉందంట. ఈ సినిమా కంప్లీట్ చేశాకే సలార్ పార్ట్ 2 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. స్టైలిష్ అండ్ రొమాంటిక్ గా కనిపించాల్సి ఉంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా ప్రభాస్ లుక్ డిఫరెంట్ గానే ఉండబోతోంది. అయితే సలార్ కి పవర్ ఫుల్ అండ్ మాసివ్ గా కనిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లుక్ డిఫరెన్స్ వస్తుందని సలార్ పార్ట్ 2 షూటింగ్ ని ఇప్పుడు స్టార్ట్ చేయడం లేదనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News