సలార్‌ 2 గురించి రెండు అప్డేట్స్‌

ఏప్రిల్ నుంచి సలార్ 2 సినిమా షూటింగ్‌ లో జాయిన్ ఇవ్వబోతున్నట్లు ఇటీవల బాబీ సింహా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Update: 2024-03-12 05:47 GMT

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్‌ -1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సలార్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అందుకు సంబంధించిన అప్డేట్‌ వచ్చింది.

ఏప్రిల్ నుంచి సలార్ 2 సినిమా షూటింగ్‌ లో జాయిన్ ఇవ్వబోతున్నట్లు ఇటీవల బాబీ సింహా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తాజాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్పందించాడు. ఏప్రిల్‌ లో సినిమా షూటింగ్ ఉంటుంది, తనపై మొదట యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేస్తారని ప్రకటించాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్‌ మరియు మే నెలల్లో ప్రభాస్ లేకుండానే పృథ్వీరాజ్ సుకుమారన్‌, బాబీ సింహా, శ్రియా రెడ్డి, జగపతి బాబుల పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నారు. ఆ తర్వాత జూన్‌ నెలలో సినిమా షూటింగ్‌ కి ప్రభాస్ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సలార్ 2 కి శౌర్యాంగ పర్వం అనే క్యాప్షన్ ని పెట్టారు. ప్రశాంత్ నీల్ సలార్ 1 చూసిన వారికి ఎన్నో ప్రశ్నలు ఉండేలా చేశాడు. రెండో పార్ట్‌ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా సస్పెన్స్‌ ను క్రియేట్‌ చేశాడు.

రెండో పార్ట్‌ లో అన్ని ప్రశ్నలకు క్లీయర్‌ సమాధానం వచ్చే విధంగా స్క్రీన్‌ ప్లే ఉంటుందని సమాచారం అందుతోంది. 2025 లో ప్రేక్షకుల ముందుకు సలార్ 2 రాబోతున్నట్లుగా తెలుస్తోంది. శృతి హాసన్ పాత్ర కూడా సెకండ్‌ పార్ట్‌ లో కాస్త ఎక్కువగానే ఉంటుందట. మొత్తానికి ఏప్రిల్‌ లో సలార్‌ మూవీ షూట్‌ ప్రారంభం అవ్వబోతుంది... జూన్‌ నెలలో ప్రభాస్‌ జాయిన్‌ అవ్వబోతున్నాడని సమాచారం అందుతోంది.

Tags:    

Similar News