'సలార్' సరికొత్త బుకింగ్ పాఠాలు..!
తద్వారా ఎక్కువ స్క్రీన్స్ లో స్క్రీనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన 'సలార్' సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇంకా ట్రైలర్ విడుదల అవ్వకుండానే సినిమా అడ్వాన్స్ బుకింగ్ గురించి చర్చ జరుగుతుంది అంటే సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ట్రైలర్ విషయం అట్లుంచి ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ పై మేకర్స్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కన్నడ సినీ వర్గాల తో పాటు ఓవర్సీస్ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 25వ తారీకు నుంచి ఐమాక్స్ వెర్షన్ కు సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాబోతుందట. భారీ ఓపెనింగ్స్ పై హంబులే ఫిలిమ్స్ వారు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నెల రోజుల ముందు నుంచే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. తద్వారా ఎక్కువ స్క్రీన్స్ లో స్క్రీనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నా కొద్ది స్క్రీన్స్ ను పెంచే ఉద్దేశ్యంతో మేకర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇక ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో సలార్ కొత్త పద్దతులు పాటిస్తున్నారు. ఎక్కువ రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ ను మొదలు పెడితే భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. అందుకే కనీసం దేశంలో సగం ప్రాంతాల్లో అయినా మూడు వారాల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారట.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా బిజినెస్ క్లోజ్ అవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్ విడుదల అయిన ఏడాది లోపే రెండవ పార్ట్ ను కూడా విడుదల చేయబోతున్నారు. విడుదల విషయంలో హంబులే వారు చేస్తున్న ప్లాన్ తో సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కితే ఇతర సినిమాల వారు ఈ పాఠాలను ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందించిన సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పలువురు ప్రముఖులు ఈ సినిమాలో నటించారు.