సలార్ ఇంగ్లీష్ వెర్షన్.. అందరి ఫోకస్ దానిపైనే..
కానీ ఇప్పుడు ఇది కేవలం ఓటీటీ వరకే పరిమితమైంది. సలార్ ఇంగ్లీష్ వెర్షన్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేయించింది. నీల్ మావ ఎలివేషన్లకు ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రూ.750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సలార్.. ప్రస్తుతం ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో గత నెల 20వ తేదీ నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది సలార్. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఐదు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్.. ఈ మాస్ ఫీస్ట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ లోనూ థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని గతంలో బజ్ వచ్చింది.
కానీ ఇప్పుడు ఇది కేవలం ఓటీటీ వరకే పరిమితమైంది. సలార్ ఇంగ్లీష్ వెర్షన్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన రెండు వారాల తర్వాత హాలీవుడ్ వెర్షన్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. సౌండ్ మేకింగ్, డబ్బింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుని విడుదల చేస్తారని టాక్ వచ్చింది.
కానీ అలా అనుకున్నట్లు ఈ సినిమా హాలీవుడ్ వెర్షన్ రిలీజ్ కాలేదు. మరి ఇప్పుడు ఓటీటీ వెర్షన్ ఇంగ్లీష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలని సినీ పండితులు అంటున్నారు. ఇక సలార్ సీక్వెల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. సలార్ లాస్ట్ లో సీక్వెల్ పార్ట్-2 టైటిల్ ను శౌర్యంగ పర్వంగా అనౌన్స్ చేశారు ప్రశాంత్ నీల్.
ఫస్ట్ పార్ట్ ను జస్ట్ శాంపిల్ గా చూపించిన ప్రశాంత్ నీల్.. అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్ లో ఉందని చెప్పేశారు. శౌర్యాంగ పర్వాన్ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నారట . అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.