సంక్రాంతికి సలార్ టెన్షన్ పెట్టేలా ఉందే..
ఇన్ని సినిమాలకు థియేటర్స్ దొరకాలంటే కష్టమే? ఈ సినిమా రిలీజ్ ల విషయంలో ఎన్నడూ లేనంత రచ్చ వచ్చే సంక్రాంతికి జరగబోతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. 2024 పొంగల్ రేసులో అరడజనుకు పైగా సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు సినిమాకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సీజన్ లోనే తమ సినిమాని రిలీజ్ చేయాలని అగ్ర హీరోలు, దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ప్రతి ఏడాది ఈ సీజన్ లో కనీసం రెండు నుంచి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ ఈసారి అంతకన్నా ఎక్కువ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
ఇప్పటికే గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామి రంగా, హనుమాన్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకోగా వీటితోపాటు లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్, అయలాన్ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి రాబోతున్నాయి. ఇన్ని సినిమాలకు థియేటర్స్ దొరకాలంటే కష్టమే? ఈ సినిమా రిలీజ్ ల విషయంలో ఎన్నడూ లేనంత రచ్చ వచ్చే సంక్రాంతికి జరగబోతోంది.
ఇదంతా కాసేపు పక్కన పెడితే.. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి సలార్ ఎఫెక్ట్ ఉండబోతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా 'సలార్'. కేజిఎఫ్ 2 తో రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రెండు భాగాలుగా తెరకెక్కిన సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.170 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టుగా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే సలార్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే సలార్ డబుల్ గ్రాస్ వసూళ్లు అంటే దాదాపు రూ.340 నుంచి రూ.400 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంత రాబట్టాలంటే సలార్ మూడు, నాలుగు వారాలు థియేటర్స్ లో నిలబడితే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి కష్టాలు తప్పవు.
ఒకవేళ సలార్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సంక్రాంతి సినిమాలకి సలార్ రూపంలో ఊహించని పోటీ ఎదురవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. సుమారు రెండున్నర నుండి మూడు నిమిషాల నిడివితో ఈ ట్రైలర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.