సలార్ లెక్కలు మారాయి

ఇలాంటి సమయంలో షారుఖ్ ఖాన్ సినిమాపై పోటీ అంటే సలార్ కలెక్షన్స్ ఓపెనింగ్ కలెక్షన్స్ మీద గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది

Update: 2023-09-28 04:16 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ చిత్రం నిజానికి రిలీజ్ నేడు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అవుట్ ఫుట్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తికరంగా లేకపోవడంతో వాయిదా వేశారు. డిసెంబర్ 22 రిలీజ్ చేయాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి.

సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటం, అలాగే ప్రభాస్ మానియా కారణంగా అన్ని చోట్ల నుంచి అదిరిపోయే ఆఫర్స్ ఈ మూవీ రైట్స్ కోసం వచ్చాయి. ఓవర్సీస్ రైట్స్ కూడా మంచి ధరకి అమ్మడయ్యాయి. అయితే మూవీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు బిజినెస్ లెక్కలు అన్ని మారిపోతున్నాయి. సలార్ ఓవర్సీస్ రైట్స్ విషయంలో నిర్మాత తిరిగి 25% తగ్గించినట్లు తెలుస్తోంది.

రిలీజ్ డేట్ వాయిదా పడటం వలన డిస్టిబ్యూటర్ కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే నిర్మాత విజయ్ కిరంగదూర్ 25 శాతం తగ్గింపుకి ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం వలన ఇప్పుడో కొత్త టెన్షన్ వచ్చి పడింది. షారుఖ్ ఖాన్ డుంకీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది షారుఖ్ లక్ ఫ్యాక్టర్ గట్టిగా పనిచేస్తోంది.

ఇలాంటి సమయంలో షారుఖ్ ఖాన్ సినిమాపై పోటీ అంటే సలార్ కలెక్షన్స్ ఓపెనింగ్ కలెక్షన్స్ మీద గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో డుంకీ సినిమాకి కూడా సౌత్ రాష్ట్రాలలో ఎక్కుప్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో రెండు సినిమాల మేకర్స్ చర్చించుకునే అవకాశం ఉందా అనేది చూడాలి.

ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత ప్రభాస్ నుంచో రాబోతోన్న సినిమా సలార్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా హోప్స్ తో ఉన్నారు. కచ్చితంగా మరో వెయ్యి కోట్లు ప్రభాస్ ఖాతాలో సలార్ తో రావాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News