సలార్.. ప్రభాస్ రేంజ్ బిజినెస్..!

తెలుగు రెండు రాష్ట్రాల్లోనే సలార్ సినిమాకు 170 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

Update: 2023-08-25 13:02 GMT

బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ పడకపోయినా సరే ప్రభాస్ ప్రతి సినిమా బిజినెస్ మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఇయర్ ఆల్రెడీ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో కూడా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేశాడు. ఓం రౌత్ మీద నమ్మకం పెట్టుకున్న ప్రభాస్ తన నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. ఆదిపురుష్ పై ముందు నుంచి డౌట్ పడిన రెబల్ ఫ్యాన్స్ సినిమా వర్క్ అవుట్ కాకపోయినా పెద్దగా ఫీల్ కాలేదు. వారి అంచనాలన్నీ కూడా సలార్ మీద ఉన్నాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తుందని బలంగా ఫిక్స్ అయ్యారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. కె.జి.ఎఫ్ రెండు భాగాలతో డైరెక్టర్ గా తన స్ట్రెంత్ చూపించిన ప్రశాంత్ నీల్ సలార్ ని కూడా ఆ కె.జి.ఎఫ్ కు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా సలార్ నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. సలార్ సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా బిజినెస్ విషయంలో ప్రభాస్ రేంజ్ ఏంటన్నది చూపిస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే సలార్ సినిమాకు 170 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఆదిపురుష్ సినిమా 130 కోట్ల దాకా ఏపీ తెలంగాణాల్లో బిజినెస్ జరగగా స్లార్ సినిమా దానికి మరో 40 కోట్లు అదనంగా బిజినెస్ జరిగింది.

నైజాం హక్కు 60 కోట్లు, సీడెడ్ 28 కోట్లు, ఆంధ్రా 75 కోట్లకు అమ్మారని తెలుస్తుంది. ఏపీ/తెలంగాణా కలిపి 170 కోట్లతో సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూకుడు చూపిస్తున్నాడు ప్రభాస్.

ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ప్రభాస్ కి పడితే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు రావడం పక్కా.. బాహుబలి తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సలార్ రూపం లో ఫీస్ట్ అందించాలని చూస్తున్నాడు ప్రభాస్. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ తో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్న టీం నెల రోజుల పాటు నేషనల్ లెవెల్ లో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ తో సినిమా పై క్రేజ్ పెంచాలని చూస్తున్నారు.

Tags:    

Similar News