1000 మందిని ప్రభాస్ అలా విసిరేసే ఫైట్!
ఒక చేత్తో 500 మందిని..మరో చేత్తో మిగిలిన వారిని అలా విసిరి పారేసే డార్లింగ్ పై యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారుట.
'బాహుబలి' లో యాక్షన్ సన్నివేశాలు చూసిన తర్వాత ప్రభాస్ ముందు ప్రత్యర్ధులు ఎంతమందైనా జుజూబీనే. కాకపోతే ఆ యాక్షన్ సన్నివేశాల కోసం కత్తులు...బల్లెలు..రక్షణ కవచాలు సరంజామా వినియో గించారు. హ్యాండ్ టూ హ్యాంట్ శత్రువుని తుదిముట్టించిన సన్నివేశాలు పెద్దగా ఉండవు. పీరియాడిక్ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు వార్ లాగే ఉంటాయి. అయితే భారీ యాక్షన్ చిత్రం 'సలార్' మాత్రం భిన్నం.
ఇప్పటికే ప్రభాస్ కటౌట్ కంటెంట్ లో ఎలా హైలైట్ అవ్వబోతుందో? ఓ అంచనాకి రావొచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్..టీజర్ తో డార్లింగ్ ని యాక్షన్ సన్నివేశాల్లో అభిమానుల ఊహకందని విధంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సెట్స్ ని సందర్శించిన ఒకరు ఓ భారీ ఫైట్ చూసి తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అందులో ప్రభాస్ దాదాపు 1000 మందితో ఒక్కడే తలపడతాడుట.
ఆ యాక్షన్ సన్నివేశం చూడటానికి రెండు కళ్లు సరిపోలేదంటున్నాడు. ఒక చేత్తో 500 మందిని..మరో చేత్తో మిగిలిన వారిని అలా విసిరి పారేసే డార్లింగ్ పై యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారుట. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో రామ్ చరణ్ పరిచయ యాక్షన్ సన్నివేశాన్ని మించి సలార్ లో ఆ సన్నివేశం ఉంటుందని అన్నాడు. థియేటర్లో ఆ సన్నివేశం చూస్తుంటే ఉద్వేగానికి గురవ్వడం ఖాయమంటున్నాడు.
దీంతో ఆ సన్నివేశాన్ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో డిజైన్ చేసి ఉంటాడో గెస్ చేయోచ్చు. ప్రభాస్ హైట్ ..వెయిట్ కి తగ్గట్టు పక్కాగా ఆ యాక్షన్ సన్నివేశాన్ని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంది. యశ్ లాంటి స్టార్ తోనే 'కేజీఎఫ్' లో ఓ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు చేసి పాన్ ఇండియాలో కాక పుట్టించాడు. అలాంటి మేకర్ ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ని ఎలా వినియోగించాలో ఊహించొచ్చు. ఆ యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చ నెలలో ప్రేక్షకలు ముందకు రావడానికి రెడీ అవుతోంది. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తోంది.