సలార్ వస్తే.. సైడివ్వాల్సిందే

ఒక వేళ సంక్రాతికి రిలీజ్ ప్లాన్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆ టైంలో పోటీ పడుతున్న మిగిలిన సినిమాలు అన్ని కూడా వెనక్కి వెళ్లాల్సిందే.

Update: 2023-09-02 04:33 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రెండు భాగాలుగా సిద్ధమైన సలార్ సిరీస్ లో పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ కావడానికి సిద్ధమైంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నారు.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన మూడు పాన్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. దీంతో వారి హోప్స్ అన్ని కూడా సలార్ చిత్రంపైనే ఉన్నాయి. రిలీజ్ దగ్గర పడుతున్న ఇప్పటి వరకు ట్రైలర్ ని ప్రేక్షకులకి అందించలేదు. మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ చాలా టెన్షన్ లో ఉన్నారు. ఇదే సమయంలో సలార్ మూవీ వాయిదా పడిందనే టాక్ తెరపైకి వచ్చింది.

సలార్ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ అవుట్ ఫుట్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ అస్సలు సంతృప్తికరంగా లేరని, ఏదో హడావిడిగా రిలీజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని భావించి వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినిమాని సంక్రాతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

ఒక వేళ సంక్రాతికి రిలీజ్ ప్లాన్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆ టైంలో పోటీ పడుతున్న మిగిలిన సినిమాలు అన్ని కూడా వెనక్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆడియన్స్ దృష్టి మొత్తం సలార్ చిత్రంపైనే ఉంటుంది. సంక్రాతి బరిలో ప్రస్తుతానికి అయితే మహేష్ బాబు గుంటూరు కారం ఉంది, అలాగే నాగార్జున నా సామి రంగ మూవీ కూడా రానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ కూడా సంక్రాతికి రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

సలార్ మూవీ సంక్రాతికి రిలీజ్ అయితే ప్రస్తుతం డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీస్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే సంక్రాతి డేట్ ఇంకా ఖరారు కాలేదని ప్రస్తుతం చిత్ర యూనిట్ ముందు డిసెంబర్ 29, జనవరి 5, జనవరి 10 తేదీలు లిస్టులో ఉన్నాయని, ఈ డేట్స్ లో ఒకటి ఖరారు చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. మరి రిలీజ్ వాయిదా వార్తలలో వాస్తవం ఎంత, అదే జరిగితే నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News