సలార్ టికెట్లు.. మైత్రీ బిగ్ రిస్క్

యాప్స్ లో బుకింగ్ ఛార్జీలు కాస్త ఎక్కువ తీసుకున్నా.. లైన్ లో నిల్చునే బాధ తప్పిందనుకున్నారు సినీ ప్రియులు.

Update: 2023-12-19 06:18 GMT

అప్పుడెప్పుడో చాలా ఏళ్ల కిందట కౌంటర్ దగ్గర టికెట్లు కొనుక్కునేవాళ్లం. గంటల తరబడి లైన్ లో నిల్చుని మరీ తీసుకునేవాళ్లు. కొన్నిసార్లు బట్టలు కూడా చిరిగిపోయేవి. అలా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఆన్ లైన్ బుకింగ్స్ యాప్స్ పుణ్యమా అని ఈ కష్టాలు తప్పాయి. యాప్స్ లో బుకింగ్ ఛార్జీలు కాస్త ఎక్కువ తీసుకున్నా.. లైన్ లో నిల్చునే బాధ తప్పిందనుకున్నారు సినీ ప్రియులు.

అయితే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ మళ్లీ పాత పద్దతినే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సలార్ సినిమా విషయంలో మైత్రీ సంస్థ.. కౌంటర్లలో టికెట్ల అమ్మే పద్దతిని కంటిన్యూ చేయబోతుందట. ఇప్పటి రోజుల్లో బుక్ మై షోలకు అలవాటు పడ్డ ప్రజలు.. గంటల తరబడి టికెట్ల కౌంటర్ దగ్గర ఎలా నిల్చుంటారన్నది కోట్లాది అభిమానుల ప్రశ్న.

స్టార్ హీరోల సినిమాలకు కౌంటర్ల వద్ద టికెట్లు అమ్మే పద్దతి చాలా రిస్క్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కౌంటర్ల దగ్గర అభిమానుల మధ్య గొడవలు జరుగుతాయని చెబుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారని.. ప్రమాదాలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు, బ్లాక్ టికెట్ రాయుళ్లు విజృంభిస్తారని వాపోతున్నారు. ఇష్టం వచ్చినట్లు టికెట్లు అమ్ముతారని అంటున్నారు.

అయితే తెలంగాణలో కేవలం సింగిల్ స్క్రీన్లకే ఈ పద్దతిని అమలు చేయనుందట మైత్రీ సంస్థ. అంతేకాకుండా తొలి రోజే ఇలా చేస్తారని తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్ టికెట్లు మాత్రం ఆన్ లైన్ లో కొనుకోవచ్చట. ఇంకా టికెట్ రేట్ల పెంపునకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, ఆంధ్రలో కూడా ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. ఏ క్షణమైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా యాప్స్ క్లాష్ పక్కా.

డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం దాదాపు రూ.800 కోట్ల వసూలు చేయాల్సి ఉంది. అంటే తొలిరోజు దాదాపు రూ.100 కోట్లు వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాపై ఉన్న హైప్ ను చూస్తుంటే అది పెద్ద విషయం కాదనిపిస్తోంది. మరి సలార్ ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News