నెవ్వర్ బిఫోర్ అనేలా సలార్ రికార్డ్!

ఒక్క ఉత్తర అమెరికాలోనే 1979 థియేటర్స్ లో సలార్ రిలీజ్ అవ్వనుందట. ప్రత్యంగిర సినిమా ఉత్తర అమెరికాలో సలార్ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.

Update: 2023-08-16 04:45 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అందులో సలార్ సీజ్ ఫైర్ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ థియేటర్స్ లో సలార్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా యూఎస్ఏ రిలీజ్ కి సంబంధించి చిత్ర నిర్మాణ కీలక అప్డేట్ ఇచ్చారు. యూఎస్ లో ఏకంగా 111 మర్కస్ చైన్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఇది వరకు ఎన్నడూ జరగని రీతిలో సలార్ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోందని చెప్పారు.

ఒక్క ఉత్తర అమెరికాలోనే 1979 థియేటర్స్ లో సలార్ రిలీజ్ అవ్వనుందట. ప్రత్యంగిర సినిమా ఉత్తర అమెరికాలో సలార్ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇండియా కాకుండా ఇతర దేశాలలోనే 5000 స్క్రీన్స్ లో సలార్ మూవీ ప్రధానంగా ఐదు భాషలలో రిలీజ్ అవ్వనుంది. అలాగే ప్రీమియమ్ థియేటర్స్ కోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా మరో కాపీ సిద్ధం చేస్తున్నారంట. దీని ద్వారా ఇంటర్నేషనల్ లెవల్ లో సలార్ మూవీని ప్రాజెక్ట్ చేయాలని హోంబలే ఫిలిమ్స్ టార్గెట్ గా పెట్టుకుంది.

ప్రశాంత్ నీల్ అందుకు తగ్గట్లుగానే అవుట్ ఫుట్ పై వర్క్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ కేజీఎఫ్ చాప్టర్ 2ని మించి ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఆడియన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో వారి అంచనాలు అందుకోవాలంటే అంతకు మించి ఉండాల్సిందే.

ఇప్పటికే ప్రభాస్ నుంచి బాహుబలి 2 తర్వాత సరైన సక్సెస్ ని ఫ్యాన్స్ చూడలేదు. అందుకే మంచి ఆకలి మీద ఉన్నారు. ఆదిపురుష్ ఇచ్చిన స్ట్రోక్ నుంచి సలార్ తో కోలుకోవాలని అనుకుంటున్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని ప్రశాంత్ నీల్ ఎంత వరకు అందుకుంటాడు అనేది చూడాలి.

Tags:    

Similar News