సలార్ VS డుంకీ.. సలార్ దే ఫస్ట్ సిక్స్
ఈ వార్ లో పై చేయి సాధించేది ఎవరు అంటూ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.
మరో రెండు వారాల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద వార్ జరుగబోతుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా, మరుసటి రోజు ప్రభాస్ 'సలార్' సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ వార్ లో పై చేయి సాధించేది ఎవరు అంటూ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. షారుఖ్ ఖాన్ డుంకీ మరియు ప్రభాస్ సలార్ సినిమాల ట్రైలర్ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదట వచ్చిన సలార్ సినిమా యొక్క ట్రైలర్ తక్కువ సమయంలో 150 మిలియన్ ల వ్యూస్ ని రాబట్టింది.
సలార్ ట్రైలర్ మొదటి 24 గంటల్లో 116 మిలియన్ ల డిజిటల్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇది సరికొత్త రికార్డ్ గా చెప్పుకోవచ్చు. డుంకీ ట్రైలర్ విడుదలకు ముందు వరకు కచ్చితంగా సలార్ ట్రైలర్ రికార్డ్ బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ సలార్ ట్రైలర్ వ్యూస్ దరిదాపుల్లోకి కూడా డుంకీ ట్రైలర్ వ్యూస్ వెళ్లే పరిస్థితి లేదని తేలిపోయింది.
సలార్ వర్సెస్ డుంకీ అంటూ జరుగుతున్న ఈ హోరా హోరీ సమరంలో మొదటి సిక్సర్ ను అంటే మొదటి పై చేయిని సలార్ దక్కించుకుంది అంటూ ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు మరిన్ని రికార్డులు కూడా సలార్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి.
మరి కొన్ని రోజుల్లో సలార్ మరియు డుంకీ సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఆన్ లైన్ ద్వారా ఓపెన్ అవ్వబోతుంది. ఆ సమయంలో మరో సిక్స్ అదేనండి అప్పుడు పై చేయి సాధించేది ఎవరో అనేది చూడాలి.
మొత్తానికి సలార్ మరియు డుంకీలు క్రిస్మస్ కి ఇండియన్ సినీ ప్రేమికులకు, అభిమానులకు కచ్చితంగా వినోదాల విందు ఇవ్వడం ఖాయం. ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఒక్క రోజు తేడాతో వచ్చిన రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ద్వారా సరికొత్త రికార్డును ఈ రెండు సినిమాలు నెలకొల్పినట్లు అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.