బిగ్ బాస్ లో ఇదో చరిత్ర...అతడికి 350 కోట్లా?
బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 18కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. 17 ఎపిసోడ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి.
బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 18కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. 17 ఎపిసోడ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో పాటు చాలా మంది హోస్ట్ లుగా పనిచేసారు. కానీ సల్మాన్ చేసినన్నీ సీజన్లు ఎవరూ హోస్ట్ చేయలేదు. సల్మాన్ హోస్ట్ చేసిన సీజన్లు బ్లాక్ బస్టర్ గానూ నిలిచాయి. గత సీజన్ 17 కూడా ఆయనే హోస్ట్ చేసారు.
అయితే ఈసారి సీజన్ 18కి సల్మాన్ ఆ బాధ్యతలు తీసుకోలేదని...ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు... సినిమా షూటింగ్ లు కారణంగా కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితులున్నాయని...ఆ కారణంగా సల్మాన్ ఈ సీజన్ హోస్ట్ చేయనట్లు బాలీవుడ్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. హోస్ట్ ని కూడా మార్చాలని నిర్వాహకులు అనుకుంటున్నారని, ఆ కారణంగానూ సల్మాన్ అనాసక్తిగా ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చింది.
అయితే తాజాగా నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. సీజన్ -18 కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి సల్మాన్ పారితోషికం ఎంత అంటే తెలిస్తే కళ్లు చెదరా ల్సిందే. ఆ రేంజ్ లో భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 14 వారాలకు గానూ సల్మాన్ మొత్తంగా 350 కోట్ల రూపాయాలు పారితోషికంగా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
నిర్వాహకులే సల్మాన్ డిమాండ్ చేయకుండా అంత మొత్తం ఆఫర్ చేసినట్లు వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఇదో చరిత్ర. బిగ్ బిస్ హిస్టరీలో ఇంతవరకూ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోలేదు. దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో బిగ్ బాస్ రన్నింగ్ లో ఉంది. వాటిని స్థానికంగా ఉన్న స్టార్ హీరోలే హోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మాదిరి బిగ్ బాస్ ని కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.