స‌ల్మాన్ ఖాన్ అందుకే పెళ్లి వ‌ర‌కూ వెళ్ల‌డం లేదు!

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇక పెళ్లి చేసుకోడు అని అంతా ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు.

Update: 2024-07-16 05:47 GMT

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇక పెళ్లి చేసుకోడు అని అంతా ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. చాలాకాలం వ‌ర‌కూ భాయ్ పెళ్లి ఎప్పుడు? సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు అడిగే వారు కానీ ఇప్పుడిక అడ‌గ‌డం మానేసారు. ఆయన వ‌య‌సు కూడా 58 ఏళ్లు రావ‌డంతో? ఆయ‌న పెళ్లి టాపిక్ నెట్టింట చ‌ర్చ‌కు రావ‌డం లేదు. ఆ మ‌ధ్య చిరంజీవిని క‌లిసిన స‌మ‌యంలో పెళ్లి చేసుకుంటే రామ్ చ‌ర‌ణ్ వ‌య‌సున్న కొడుకు ఉండేవాడ‌ని అనేసారు.

దీంతో మ‌రోసారి భాయ్ ఇక పెళ్లి చేసుకోడ‌ని ఓ క్లారిటీ దొరికేసింది. మ‌రి స‌ల్మాన్ ఎందుకు అలా ఉండిపోయాడు? ఏ కార‌ణంతో పెళ్లి చేసుకోలేదు? అందుకు బ‌ల‌మైన కార‌ణం ఏదైనా ఉందా? అంటే తాజాగా ఆ సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కూ ఈ విష‌యం ఎక్క‌డా లీక్ అవ్వ‌లేదు. పెళ్లి చేసుకోలేదంటే చేసుకోలేద‌నే టాపిక్ త‌ప్ప ఎందుకు చేసుకోలేదు? అన్న‌ది ఎక్క‌డా హైలైట్ అవ్వ‌లేదు.

తొలిసారి ఆ విష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ తండ్రి రివీల్ చేసారు. `స‌ల్మాన్ ఖాన్ చాలా ఈజీగా ప్రేమ‌లో ప‌డిపోతాడు. అలా ప్రేమ‌లో మునిగిన స‌మ‌యంలో త‌న‌ని చాలా ఆలోచ‌న‌ల్ని బుర్ర‌ని తొలిచేస్తాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకుంటే అంత‌టి ప్రేమ‌ని పెళ్లి త‌ర్వాత చూపిస్తుందా? లేదా? త‌న ఇంట్లో వాళ్ల‌ను స‌రిగ్గా చూసుకుంటుందా? లేదా? అని చాలా ఆలోచిస్తాడు. అందుకే పెళ్లి వ‌ర‌కూ వెళ్ల‌కుండా ప్రేమ వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నాడు.

మేము కూడా పెళ్లి చేసుకోమ‌ని చాలాసార్లు చెప్పి చూసాం. కానీ అత‌ని మ‌న‌సు అంగీక‌రించ‌లేదు. అందుకే ఒంట‌రిగా ఉన్నాడు` అని అన్నారు. ఇలాంటి స‌మాధానం కుటుంబ స‌భ్యుల నుంచి ఏనాడు రాలేదు. ఎప్పు డూ స‌ల్మాన్ ఖాన్ ని అడిగితే ఎస్కేప్ అవ్వడం త‌ప్ప ఆయ‌న స‌రైన బ‌ధులిచ్చింది లేదు. తొలిసారి స‌ల్మాన్ పెళ్లి సీక్రెట్ వీడింది. ప్రస్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంంలో `సికంద‌ర్` అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News