ఆ హిట్ మూవీ సీక్వెల్ నుంచి స్టార్ హీరో ఔట్
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ 'రేస్' 4 కోసం హిందీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ 'రేస్' 4 కోసం హిందీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టిప్స్ ప్రొడక్షన్స్ హౌస్ లో రేస్ 4 సినిమా ఇప్పటికే ప్రకటన వచ్చింది. రేస్ 1, రేస్ 2 సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన విషయం తెల్సిందే. రేస్ 3 లో మాత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించాడు. రేస్ 4 ను ప్రకటించిన సమయంలో కూడా నిర్మాత రమేష్ తౌరానీ హీరోగా సల్మాన్ ఖాన్ పేరును ప్రకటించాడు. సల్మాన్ ఖాన్ కూడా రేస్ 4 స్టోరీ లైన్ కి ఓకే చెప్పడంతో పాటు డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట.
షూటింగ్ కి రెడీ అవుతున్న సమయంలో రేస్ 4 నుంచి సల్మాన్ తప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి. అందుకే సల్మాన్ ఖాన్ తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందులో భాగంగానే రేస్ 4 నుంచి తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ తదుపరి సినిమా కోసం మంచి కథలు వింటున్నాడు. ఇప్పటికే రెండు మూడు ఓకే చేశాడని, త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రేస్ 4 నుంచి సల్మాన్ ఖాన్ తప్పుకోవడం తో నిర్మాతలు ఆలోచనల్లో పడ్డారట. ఇప్పటికే రేస్ 4 కోసం సైఫ్ అలీ ఖాన్ తో సంప్రదింపులు జరిపారని సమాచారం అందుతోంది. గతంలో రేస్ సినిమాలో నటించిన అనుభవం ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు రేస్ 4 లో నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే సల్మాన్ ఖాన్ ఎందుకు ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ రేస్ 4 నుంచి తప్పుకున్నా కూడా ఆయన్ను గెస్ట్ రోల్ లో అయినా చూపించాలని నిర్మాత రమేష్ తౌరానీ భావిస్తున్నాడట.
గత ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులమ ఉందుకు వచ్చే పరిస్థితి లేదు. రేస్ 4 తో వస్తాడని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చాడు. ప్రస్తుతం సికిందర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది ఆ సినిమా తో రాబోతున్నాడు. 2025 లోనే మరో సినిమాను సల్మాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2024 లో ఒక్క సినిమా కూడా విడుదల చేయని కారణంగా 2025 లో సల్మాన్ ఖాన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.