సూపర్ స్టార్ ని ఈ ఏజ్ లో లవర్ బోయ్ గా చూస్తారా?
ఈ ఏజ్ లో అతడిని లవర్ బోయ్ గా ప్రేక్షకాభిమానులు చూడగలరా? 58 లో 28 మ్యాజిక్ సాధ్యమేనా? అతడి పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందా?
సల్మాన్ ఖాన్-సూరజ్ బార్జాత్యా కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రేమ కావ్యాలకు ఆ కాంబినేషన్ ఓ బ్రాండ్ గా ముద్రపడింది. ఇప్పటివరకూ వచ్చిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్లగా నిలిచాయి. 'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్ కే హైన్ కౌన్', 'హమ్ సాథ్ సాథ్ హైన్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద మోతమోగించిన చిత్రాలవి.
ఇదే కాంబినేషన్ ఐదవ చిత్రం 'ప్రేమ్ కీ షాదీ' టైటిల్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పేసారు. కానీ ఇంతవరకూ పట్టాలెక్కించలేదు. ఈప్రాజెక్ట్ ప్రకటించ గానే అభిమానులు ఎగిరి గంతేసారు. కానీ ఆ ఉత్సాహం వాయిదా పర్వం నిరుగార్చేసింది. దీంతో ఈ కాంబినేషన్ లో ఇప్పట్లో సినిమా ఉండదేమో అనుకున్నారంతా. మరి కొంత మంది ప్రాజెక్ట్ రద్దయిందని భావించారు.
అయితే ఈసినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఏడాది ప్రాజెక్ట్ ప్రారంభమవుతందనే లీకులందు తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ...మురగదాస్ దార్శకత్వంలో సికందర్ అనే భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. అలాగే 'బుల్' అనే మరో చిత్రం కమిట్ అయ్యాడు. ఈరెండిటితో పాటు 'ప్రేమ్ కీ షాదీ'ని కూడా పట్టాలెక్కించలనుకుంటున్నారుట. అయితే 58 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ తో లవ్ స్టోరీ అన్న దానిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏజ్ లో అతడిని లవర్ బోయ్ గా ప్రేక్షకాభిమానులు చూడగలరా? 58 లో 28 మ్యాజిక్ సాధ్యమేనా? అతడి పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందా? నాటి మేజిక్ ని సూరజ్ బార్జాత్యా రిపీట్ చేయగలరా? ఇలా రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.