సిటాడెల్ ట్రైలర్ 2.. సామ్ అదరగొట్టేసింది

కొత్త ట్రైలర్ లో వరుణ్ ధావన్, సమంత కలిపి చేసిన యాక్షన్ సీన్స్.. హైలెట్ గా నిలిచాయి. 1990 బ్యాక్ డ్రాప్ తో సిరీస్ సాగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది.

Update: 2024-10-29 07:11 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్ర పోషించిన ఆ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్ జోనర్ లో రూపొందించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు అయిన డీ2ఆర్ ఫిల్మ్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సిరీస్.. త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కొద్ది రోజుల నుంచి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. వివిధ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. వెబ్ సిరీస్ పై బజ్ క్రియేట్ చేస్తున్నారు. స్పెషల్ పోస్టర్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.

వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు. కొత్త ట్రైలర్ లో వరుణ్ ధావన్, సమంత కలిపి చేసిన యాక్షన్ సీన్స్.. హైలెట్ గా నిలిచాయి. 1990 బ్యాక్ డ్రాప్ తో సిరీస్ సాగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. బన్నీ క్యారెక్టర్ పోషిస్తున్న వరుణ్ ఎంట్రీతో ట్రైలర్ స్టార్ట్ అయింది. చేస్తున్నది తప్పు అని తెలిసినా.. చేయక తప్పదు అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఆ తర్వాత తన కుమార్తెను కాపాడుకోవడానికి ట్రై చేస్తున్న రోల్ లో సమంత కనిపించారు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. అదే సమయంలో ఎమోషన్స్ పండించారు. ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లో వేరే లెవెల్ లో నటించారు. అయితే ఓవరాల్ గా ట్రైలర్.. తెగ ఆకట్టుకుంటోంది. వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచుతోందని నెటిజన్లు చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ సిరీస్.. అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

అయితే సెకెండ్ ట్రైలర్ లో సమంతను హైలెట్ చేసి చూపించారు మేకర్స్. సామ్ కోసమే కొత్త ట్రైలర్ ను కట్ చేసినట్లు అనిపిస్తుంది. అమెరికన్‌ సిరీస్‌ సిటాడెల్ కు ఇండియన్‌ వెర్షన్‌ గా రాబోతున్న సిటాడెల్: హనీ బన్నీ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్న ఆ సిరీస్ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News