11 నిమిషాలు.. సింగిల్ టేక్.. అదీ సమంత అంటే!

స్టార్ హీరోయిన్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న ఆ సిరీస్ కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు.

Update: 2024-10-16 10:21 GMT

స్టార్ హీరోయిన్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న ఆ సిరీస్ కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ సిటాడెల్‌ కు ఇండియన్ వెర్షన్ గా సిటడెల్‌ : హనీ బన్నీని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా.. త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఫ్యామిలీ మ్యాన్‌2 సిరీస్ లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత.. సిటాడెల్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. మార్షల్‌ ఆర్ట్స్‌ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఎలాంటి డూప్‌ లేకుండా స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ ను పూర్తి చేశారట. అయితే మేకర్స్ రీసెంట్ గా ముంబైలో సిటాడెల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సిరీస్ కోసం తాను, సమంత చాలా కష్టపడ్డామని తెలిపారు. సిటాడెల్ లో ఓ యాక్షన్‌ సన్నివేశం కోసం తనతోపాటు సామ్ సమంత అవిశ్రాంతంగా పనిచేశారని చెప్పారు. ఆ సీన్ కోసం ఎంతో కష్టపడ్డామని వెల్లడించారు. ఆ సన్నివేశం 11 నిమిషాలు ఉంటుందని, సింగిల్ టేక్‌లో ఎలాంటి కట్స్‌ లేకుండా షూట్ చేశామని పేర్కొన్నారు. అది సిరీస్‌ క్లైమాక్స్‌ లో వస్తుందని, కచ్చితంగా ఎంతో ఉత్కంఠ కలిగిస్తుందని అన్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫిల్ అవుతారని చెప్పారు.

అయితే ఇప్పటికే సిటాడెల్ మేకర్స్.. ఓ వేడుకలో సిరీస్ కోసం మాట్లాడి అంచనాలు పెంచారు. క్లైమాక్స్‌ మరోస్థాయిలో ఉంటుందని తెలిపారు. ఆ యాక్షన్‌ సన్నివేశం సిరీస్‌ మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుందని వివరించారు. ఇప్పుడు ఆ సీన్ కోసమే వరుణ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సిటాడెల్ పై అంచనాలు పెరిగిపోయాయని నెటిజన్లు చెబుతున్నారు. సమంతనా.. మజాకా అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మంచి హిట్ అందుకుంటారని అంటున్నారు.

ఇక.. మయోసైటిస్ బారినపడ్డ సమయంలోనే సిటాడెల్ షూటింగ్ లో సమంత పాల్గొన్నారు. అప్పుడు ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి కళ్లు తిరిగి కూడా పడిపోయారు. షూట్ పూర్తయ్యాక విదేశాలకు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఇండియా వచ్చేశారు. ఇప్పుడు సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నవంబర్ 7వ తేదీన నుంచి స్ట్రీమింగ్ కానున్న సిటాడెల్ తో సమంత ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News