అక్క మనసులో ప్రేమను ముందే పసిగట్టిన చెల్లెలు!
తాజాగా అక్క మనసులో చైతన్యపై ఉన్న ప్రేమ గురించి శోభిత చెల్లెలు సమంత రివీల్ చేసారు. ఈ పెళ్లి వేడుకలో సమంత కూడా సందడి చెసిన సంగతి తెలిసిందే.
అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కొంత కాలం పాటు ప్రేమించుకున్న జంట ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టడంతో ప్రేమ కథకు పుల్ స్టాప్ పడింది. భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా అక్క మనసులో చైతన్యపై ఉన్న ప్రేమ గురించి శోభిత చెల్లెలు సమంత రివీల్ చేసారు. ఈ పెళ్లి వేడుకలో సమంత కూడా సందడి చెసిన సంగతి తెలిసిందే.
తాజాగా పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకుంటూ అక్కపై తన ప్రేమను చాటుకుంది. `ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూవ్ మెంట్. అక్కా నిన్ను చాలా ప్రేమిస్తున్నా. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో? అలాగే కొత్తగా నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు. ఇద్దరు ఎంతో అందంగా ఉన్నారు. గౌరవ ప్రదరమైన జంట` అంటూ రాసుకొచ్చింది.
శోభిత పెళ్లి కుమార్తె దుస్తుల్లో ఉన్న ఫోటోను పంచుకుంది. ఇక శోభిత సిస్టర్ సమంత డాక్టర్. సమంత 2022లోనే పెళ్లి చేసుకుంది. అంటే అక్క కంటే ముందే చెల్లెలు వివాహం జరిగింది. శోభిత తండ్రి నేవల్ ఆఫీసర్ అన్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి శోభిత. తెనాలిలో పుట్టి వైజాగ్ లో చదువుకుంది. చదువు పూర్తయిన అనంతరం మోడలింగ్ లోకి ఎంటర్ అయి బాలీవుడ్ సినిమాలకు ప్రమోట్ అయింది.
అక్కడ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. చివరిగా అక్కినేని ఇంట నాగార్జున పెద్ద కోడలు అయింది. వివాహం తర్వాత శోభిత సినిమాలు చేసే అవకాశం ఉంది. కానీ ఆమె ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ ప్రకటించలేదు. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయలేదు.