సమంత.. అలాంటి రోల్స్ ను అస్సలు యాక్సెప్ట్ చేయదట!
రీసెంట్ గా సినిమాల్లోని మహిళల పాత్రల గురించి మాట్లాడారు దీంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత కాస్త గ్యాప్ తర్వాత రీసెంట్ గా సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్ తో మరోసారి మెప్పించారు సామ్. నార్మల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టేశారు. తన టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సామ్ కోసమే సిటడెల్ సిరీస్ చూడాలనే ఆకట్టుకున్నారు. విమర్శకుల ప్రశంసలు కుడా అందుకుంటున్నారు.
అయితే సిటడెల్ సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేపట్టిన
సమంత.. ఆ తర్వాత కూడా అదే రీతిలో దూసుకెళ్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కట్టుబాట్లను తెంచుకుని సాధికారత దిశగా అడుగులు వేసిన యువతిగా సిటడెల్ లో అదరగొట్టిన సమంత.. రీసెంట్ గా సినిమాల్లోని మహిళల పాత్రల గురించి మాట్లాడారు. దీంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లో మహిళలకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు సమంత. అందుకే మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం ఒక యాక్ట్రెస్ గా తన బాధ్యత అని తెలిపారు. సాధారణంగా ఆడియన్స్ అన్నీ చూస్తుంటారని, అన్నీ గమనిస్తారని చెప్పారు. అందుకే ఎప్పుడైనా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏదైనా ఒక రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు పూర్తి బాధ్యత ఉండాలని, అది తనకు ఉందని వెల్లడించారు.
ఏదైనా సినిమాలోని రోల్ ను ఎంచుకున్నప్పుడు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు సమంత. మూవీలోని రెండు, మూడు సీన్స్ లో మాత్రమే కనపడే రోల్స్ కు ఎప్పుడూ దూరంగా ఉంటానని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని తాను ఎప్పుడూ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తాను యాక్ట్ చేసే యాడ్స్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని సమంత తెలిపారు.
అదే సమయంలో సిటడెల్ సిరీస్ లో నటించడం పెద్ద సవాలుగా అనిపించిందని సమంత వెల్లడించారు. యాక్షన్ సీక్వెన్సుల్లో హీరోతో ఈక్వల్ గా కష్టపడ్డానని, అలాంటి ఛాన్స్ లు అరుదుగా వస్తుంటాయని అన్నారు. వాటి కోసమే హీరోయిన్స్ వెయిట్ చేస్తుంటారని, తాను కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పారు. తనకు వచ్చిన ఆఫర్ల కౌంట్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల కౌంట్ మధ్య చాలా తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు సమంత.