సమంత రోల్ మోడల్ సూపర్ ఛాయిస్!
ఇలా ఒకటేంటి అమ్మడు బాలీవుడ్ కర్చర్ కి పూర్తిగా అలవాటు పడి పనిచేస్తోంది. ` సీటాడెల్` ఇండియన్ వెర్షన్ లోనూ ఛాన్స్ అందుకుంది.
సమంత ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీకి దూరం జరిగి బాలీవుడ్ కి దగ్గరవుతోన్న సంగతి తెలిసిందే. `ఫ్యామిలీ మెన్` వెబ్ సిరీస్ తో అమ్మడికి నార్త్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ క్రేజ్ తోనే అక్కడ ప్రాజెక్ట్ ల్లో అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ స్టార్ హీరోలతో ఇంటరాక్ట్ అవుతుంది. టాక్ షోల్లో పాల్గొంటుంది. ఇలా ఒకటేంటి అమ్మడు బాలీవుడ్ కర్చర్ కి పూర్తిగా అలవాటు పడి పనిచేస్తోంది. ` సీటాడెల్` ఇండియన్ వెర్షన్ లోనూ ఛాన్స్ అందుకుంది.
ఇటీవలే ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అమెరికన్ వెర్షన్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించగా, ఇండియన్ వెర్షన్ లో ఎంతో మంది భామలున్నా? ఆ ఛాన్స్ ను సమంత మాత్రమే ఒడిసి పట్టుకుంది. ఇక్కడే అర్దమవుతుంది సామ్ భవిష్యత్ ప్లానింగ్ అన్నది ఏ రేంజ్ లో వేసుకుని ముందుకెళ్తుందన్నది. తాజాగా బిజినెస్ టుడే నిర్వహించిన మోస్ట్ పాపులర్ ఉమెన్ కార్యక్రమంలో సమంత పాల్గొంది.
ఈ సందర్భంగా సమంత ఇలా మాట్లాడింది. `సీటాడెల్ తొలి సీజన్ అమెరికాలో, రెండోది ఇండియాలో, మూడోది మెక్సికలో జరుగుతుంది. అమెరికా వెర్షన్ లో నటించిన ప్రియాంక చోప్రా నే నాకు స్పూర్తి. ఆమె నా రోల్ మోడల్. గొప్పగా ఆలోచించడం అన్నది ఆమె నుంచే నేర్చుకున్నాను. అంత గొప్పగా ఆలోచించగలిగింది కాబట్టే ఆ స్థాయికి చేరుకుంది. ఓ నటిగా ఆమె ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది.
ఓ భారతీయ మహిళ దేశ సరిహద్దులు దాటి ఇతర భాషల్లో అవకాశం అందుకోవడం అంత సులభమైన పని కాదు. అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం ఎంతో సాహసంతో కూడుకున్నదే. అందులో ప్రియాంక చోప్రా గొప్ప విజయం సాధించింది. అందుకే ఆమె రోల్ మోడల్ గా నిలిచారు` అంది. పీసీ హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత భారతీయుల నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కున్న సంగతి తెలిసిందే. భారతీయ సంప్రదయాల్ని మంటగ లపిందని విమర్శించారు. కానీ పీసీ వాటిని పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకెళ్లింది. సమంత లాంటి వాళ్లకు ఆదర్శంగానూ నిలిచింది. మరి సమంత కూడా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ప్లాన్ చేస్తుందో? ఏమో!