సమంత లైఫ్ ఫైట్ లేదా? ప్లైట్ మోడ్ లోనా!
తాజాగా ఆమె పాడ్ కాస్ట్ లో ఆమె బాల్యం గురించి...అక్కడ తన జీవితం గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. సమంతని అంతా గోల్డ్ స్పూన్ అనుకుంటారు.
సమంత నేడు స్టార్. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న నటి. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంది. అందుకోసం కోట్ల లో డబ్బు ఖర్చు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన సమంత. మరి తెలియని సమంత? ఏంటి? అంటే ఆమె జీవితం గురించి చాలా విషయాలే ఉన్నాయని తెలుస్తుంది. తాజాగా ఆమె పాడ్ కాస్ట్ లో ఆమె బాల్యం గురించి...అక్కడ తన జీవితం గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. సమంతని అంతా గోల్డ్ స్పూన్ అనుకుంటారు.
అందులో తప్పేం లేదు. హీరోయిన్ అయిందంటే? ఆ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా అవుతుందా? అనుకుంటారు. కానీ సమంత బాల్యం వేరు. ఆమె జీవితం వేరు అని ఈ కథ చదివితే తెలుస్తుంది. బాల్యంలో ఆమె విలాసవంతమైన జీవితం గడప లేదు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశాని అని తెలిపింది. ' పూట భోజనం కోసం చాలా కష్టపడేవాళ్ళం. చిన్న తనం నుంచి నన్ను బాగా చదువుకో అని నా తల్లిదండ్రులు చెప్పేవారు. నేను కూడా బాగా చదివేదాన్ని అని పై చదువులు చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితి ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు.
ఆ టైం లో ఏ పని దొరికితే ఆ పని చేశాను. ఓ వైపు చదువుకుంటూనే పని చేసేదాన్ని. ఓ స్టార్ హోటల్ లో పని చేశాను అప్పుడు నాకు నెలకు 500 ఇచ్చేవారు. అదే నా మొదటి సంపాదన అని ఓ సందర్భంలో తెలిపింది. తాజా పాడ్ కాస్ట్ లో...తన అనుభవాలను పంచుకోవడం. ప్రజలకు తనవంతు సహాయం చేయడం. సహాయం..సామాజిక బాధ్యతపై అవగాహనపై చర్చింది. నేను డేలో కేవలం ఆరు గంటలు మాత్రమే నిద్రపోతాను. మిగతా సమయంలో ఏదో పనిచేస్తూనే ఉంటాను. మయోసైటిస్ కారణంగా అలసిపోయాను అనే మాటను ఒప్పుకోను. 13 సంవత్సరాలు అవిశ్రామంగా పనిచేసాను.
ఎదుగుతోన్న దశలో నాకు విలాసవంతమైన బాల్యం లేదు. కాబట్టి చిన్నప్పటి నుండి విజయంపై నా దృష్టి ఉండేది. ఎప్పటికప్పుడు నామైండ్ ని పాజిటివ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతీ ప్రయాణం ఎంతో శ్రమతో కూడుకున్నదే. అందులో ఒత్తిడులు ఉంటాయి. అన్ని ఎదుర్కోవాల్సిందే. 22-23 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. కొంతమంది అమ్మాయిలు ఇంకా చిన్న వయస్సులోనే వచ్చి ఉండొచ్చు. అందరూ అన్ని తెలుసుకుని ఏరంగంలోకి రాదరు. కొంతవరకూ తెలుసుకుంటాం.
ప్రయాణం మొదలైన తర్వాత ఎన్నో విషయాలు తెలుస్తాయి. నిరంతరం తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఆపకూడదు. నేను విజయం సాధించిన తర్వాత దాన్ని కోల్పోతానేమోనని భయం మొదలైంది. ఆ తర్వాత అంతకన్నా పెద్ద సక్సెస్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంటాను. కాబట్టి నా కెరీర్ మొత్తంలో ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్‌లో ఉన్నానని విశ్వషిస్తాను.