సద్గురు ఆధ్యాత్మిక చింతనలో సమంత!
సద్గురు ఇషా పౌండేషన్ లో సైతం సమంత కనిపించింది.
సమంత కొంత కాలంగా ఆధ్యాత్మిక చింతనలోనూ తరుచూ కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమెలో ఎన్నో రకాల మార్పులొచ్చాయి. ఆధ్యాత్మికంగా గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. విడాకుల తర్వాత భారత్ లోనే ప్రఖ్యాత దేవాలయాలన్నింటిని సందర్శించింది. కషాయం ధరించి వివిధ ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల్లో పాల్గొంది. సద్గురు ఇషా పౌండేషన్ లో సైతం సమంత కనిపించింది.
సద్గురు శాంతి వ్యాఖ్యల్ని..జీవితం పట్ల ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రశాంతమైన మనసు..హృదయంతో విని వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో సమంత మరోసారి సద్గురు సేవలో పునీతురాలైంది. సేవలో పాల్గొన్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నలుపు వస్త్రాలు.. మెడలో పూల మాలలు ధరించి సద్గురు చెబుతోన్న నీతి బోధనల్ని ఎంతో శ్రద్దగా వినడం ఇక్కడ చూడొచ్చు.
రెండు చేతులు జోడించి సద్గురుకి నమస్కరించిన విధానం ఆమెలో ఎంతో భక్తిశ్రద్దల్ని తెలియజేస్తుంది. వందలాది మంది ఆ ఆధ్యాత్మిక చింతన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి సమంత ఇన్ స్టాలో ఇలా రాసుకొచ్చింది. `మనలో చాలామంది మంచి గురువు లేదా మెంటార్ కోసం వెతుకుతారు. ఎందుకంటే జీవితానికి పూల బాట వేసింది వాళ్లే. వాళ్ల జ్ఞానం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. జ్ఞానం కోసం ప్రపంచం నలుమూలలా వెతకాల్సిందే. దైనందిన జీవితంలో పడి చాలా విషయాల గురించి తెలుసుకోం. కానీ సరైన జ్ఞానాన్ని కలిగి ఉంటే ఇది సులభమవుతుంది. ఇది సాధారణమని మీరు అనుకుంటున్నారు. కానీ ఇది సాధారణమైనది కాదు.
మీరు దాని కోసం కష్టపడాలి. దాని గురించి కేవలం తెలుసుకుంటే సరిపోదు. నేర్చుకున్నది, తెలుసుకున్నది అమలు చేయాలి. కేవలం ప్రయత్నంతోనే ఆపకూడదు` అని రాసుకొచ్చింది సద్గురు కు రెండు చేతులు జోడించి నమస్కరించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.