పిక్ టాక్ : అందాల సమంత కొత్త అందం

ఖుషి సినిమా తర్వాత సమంత నుంచి రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

Update: 2024-06-02 12:28 GMT

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్య కారణంగా గత ఏడాది కాలంగా కొత్త సినిమాలు చేయడం లేదు. ఏడాది పాటు షూటింగ్స్‌ కు పూర్తిగా దూరంగా ఉన్న సమంత ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఖుషి సినిమా తర్వాత సమంత నుంచి రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.


సినిమాల్లో హీరోయిన్‌ గా నటించకున్నా కూడా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంది. షూటింగ్స్ కు ఏడాది బ్రేక్ తీసుకున్న సమయంలో కూడా సమంత ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంది.


తాజాగా ఈ ఫోటోలను సమంత ఇన్‌ స్టా లో షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత ఈ మధ్య కాలంలో మరింత అందంగా తయారు అయ్యిందని ఫ్యాన్స్ మరియు నెటిజన్స్‌ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. నెట్టింట సమంత ఫోటోలు ఎప్పటిలాగే వైరల్‌ అవుతున్నాయి.

సమంతకు సంబంధించిన ఏ ఫోటోలు షేర్‌ చేసినా కూడా అవి ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించడం, అందరూ వాటిని షేర్‌ చేయడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఈ ఫోటోలను కూడా నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత 'బంగారం' సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గన్ పట్టుకుని ఉన్న సమంత పోస్టర్‌ ను సోషల్‌ మీడియా ద్వారా ఒక్కసారిగా హైప్ క్రియేట్‌ చేశారు. ఈ ఏడాదిలోనే వెబ్‌ సిరీస్ మరియు సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News