ఉర్ఫీ మ్యాజికల్ గౌన్‌పై సమంత ప్ర‌శంస‌

విమ‌ర్శ‌లు ఎన్ని ఎదురైనా కానీ ఈ బోల్డ్ బ్యూటీ త‌గ్గేదేలే అంటూ ఫ్యాష‌న్ ప్రియులు విస్తుపోయేలా చేస్తోంది.

Update: 2024-05-04 14:30 GMT
ఉర్ఫీ మ్యాజికల్ గౌన్‌పై సమంత ప్ర‌శంస‌
  • whatsapp icon

ఉర్ఫీ జావేద్ ఫ్యాష‌న్ ఐక‌న్‌గా అభిమానుల హృద‌యాల‌ను ఏల్తోంది. నిరంత‌రం ఏదో ఒక బోల్డ్ స్టేట్ మెంట్ తో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తూనే ఉన్న ఈ బ్యూటీ ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ప్ర‌పంచానికి అనుగుణంగా కొత్త ట్రెండ్ తో అగ్గి రాజేస్తూనే ఉంది. విమ‌ర్శ‌లు ఎన్ని ఎదురైనా కానీ ఈ బోల్డ్ బ్యూటీ త‌గ్గేదేలే అంటూ ఫ్యాష‌న్ ప్రియులు విస్తుపోయేలా చేస్తోంది. వైవిధ్యం.. వెరైటీ.. విల‌క్ష‌ణ‌త ఇవ‌న్నీ ఈ భామ ఫ్యాష‌న్ సెన్స్ కి ప్ర‌జ‌లు ఆపాదిస్తున్న ప‌దాలు.

తాజాగా మ‌రోసారి ఉర్ఫీ జావేద్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈసారి త‌న డిజైన‌ర్ డ్రెస్ పై సీతాకోక చిలుక‌లు రెక్క‌లు విదిల్చాయి. రెక్క‌లు విచ్చి ఎగిరాయి కూడా. పసుపు రంగు పువ్వులు.. సీతాకోకచిలుకలతో అలంకరించిన మ్యాజికల్ బ్లాక్ గౌను ధరించింది ఊర్ఫీ. ఈ అద్భుతమైన దుస్తులు సమంతా రూత్ ప్రభు సహా చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. వారంతా ఊర్ఫీ శైలిపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఈవెంట్‌లో ప్రదర్శించిన ఉర్ఫీ జావేద్ బ్లాక్ ప్రిన్సెస్ గౌను చూడ‌టానికి సాధారణంగా క‌నిపించినా కానీ... పసుపు రంగు పువ్వులు రియ‌లిస్టిక్‌గా వికసిస్తూ కనిపిస్తున్నాయి. కెమెరాల‌కు పోజులిచ్చేటప్పుడు కృత్రిమ సీతాకోకచిలుకలు గాల్లోకి ఎగర‌డం నిజంగా అబ్బుర‌ప‌రిచింది. ఈ అద్భుతమైన ప్రదర్శన ఊర్ఫీకి మంచి పేరు తెచ్చింది. ఈ డిజైన‌ర్ గౌనును చూడ‌గానే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంద‌మైన‌ కళాకృతి అని ప్ర‌శంసిస్తున్నారు.

సమంతా రూత్ ప్రభు ప్రత్యేకంగా ఉర్ఫీ గౌను అందానికి ముగ్ధులయ్యారు. 'బ్యూటిఫుల్ ఉర్ఫీ' అనే వ్యాఖ్యతో సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేసారు. దుస్తులపై తనకున్న ప్రేమను వ్యక్తీకరించడానికి హార్ట్ ఈమోజీల‌ను జోడించారు. బోల్డ్ అండ్ యూనిక్ ఫ్యాషన్ సెన్స్ తో పాపుల‌రైన‌ ఉర్ఫీ జావేద్ ఇటీవలి త‌న‌దైన‌ చిరస్మరణీయమైన ముద్ర వేసేలా చూసుకుంటోంది. ఈసారి ప్రదర్శనలో ప్రకృతి అందాన్ని మేళ‌వించి ఫ్యాషన్ ని ఆవిష్క‌రించింది. ఊర్ఫీ ఎంపిక చాలా అద్భుతంగా ఉందంటూ దీనిపై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. స‌మంత త‌దుప‌రి సిటాడెల్ - హ‌నీ బ‌న్నీ ప్ర‌చారంలో బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. బంగారం అనే సినిమాని స్వ‌యంగా నిర్మిస్తోంది. అందులో త‌ను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది.

Tags:    

Similar News