నువ్వు వారియర్‌వి.. హీనా ఖాన్‌ కు సమంత వైర‌ల్‌ పోస్ట్

యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్ లో అక్షర పాత్ర ఆమె నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Update: 2024-07-02 14:37 GMT

బాలీవుడ్ లో వెండితెర హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో బుల్లితెర నటీనటులకు కూడా అంతే క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అలా పాపులర్ అయిన బుల్లితెర హీరోయిన్లలో హీనా ఖాన్‌ ఒకరు. బాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ సీరియల్ యాక్టర్ గా ఈమెకు బాగా గుర్తింపు ఉంది. యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్ లో అక్షర పాత్ర ఆమె నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.


సీరియల్స్ తో పాటు కొన్ని హిందీ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లో కూడా హీనా ఖాన్‌ నటించింది. కెరియర్ పరంగా బాగా అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో ఆమె అనారోగ్యానికి గురి కావడం బుల్లితెర ప్రేక్షకులను కలవర పెడుతోంది. రీసెంట్గా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తన అభిమానులకు వెల్లడించింది. ఆమెకు బ్రెస్ట్ క్యాన్స‌ర్ 3వ ద‌శ‌లో ఉన్న‌ట్లు డాక్టర్లు గుర్తించారు. ఇదే విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా హీనా ఖాన్‌ తెలియ‌జేసింది.

త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహిత‌లు స‌హ‌క‌రాంతో ఈ భయంకరమైన వ్యాధితో పోరాటం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయం తెలుసుకొని ఎంతో బాధపడిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఆమె చికిత్స చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

నెటిజనులు, అభిమానులతో పాటు ఆమెకు ప‌లువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు ధైర్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తాను కూడా మయోసైటిస్ అనే ఒక వింత వ్యాధితో పోరాడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్థిమితపడిన సమంత హీనా కు మద్దతు తెలియపరుస్తూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే కాక పలువురు సమంతను అభినందిస్తున్నారు.

Read more!

మీకు ఈ వ్యాధితో పోరాడి విజయం సాధించడానికి ఆ దేవుడు తగినంత శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఒక గొప్ప యోధురాలు.. అంటూ సమంత హీనా ఖాన్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధైర్యాన్ని అందించింది ఈ పోస్ట్ పై స్పందించిన హీనా..‘సామ్ మీరు అన్నింటిలోనూ నిజ‌మైన స్టార్‌. జీవితంలో మీకు ఎదురైన స‌వాళ్ల‌ను మీరు హ్యాండిల్ చేసిన విధానం చాలా అద్భుతం. మీ గురించి తెలుసుకుని ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ‌, ఆశీర్వ‌దాల‌కు ధ‌న్య‌వాదాలు.’ అని సమాధానం ఇచ్చారు.

మయోసైటిస్ కారణంగా తన కెరీర్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత ఆ తర్వాత ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె మూవీ లకు మళ్ళీ విరామం ఇచ్చి పూర్తిగా తన ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతోంది. త్వరలో సమంత నుంచి మరిన్ని చిత్రాలు రావాలని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News

eac